Aadhar Card: మీరు రూ.50 వేలకు పైబడిన చేస్తున్న ఆర్థిక లావాదేవీలకు పాన్ నెంబర్ ఉండాల్సిందే. బ్యాంకులో ఖాతా తెరవడం మొదలుకొని ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా పాన్ కార్డు తప్పనిసరి అయిపోయింది. ఇంతటి కీలకమైన డాక్యుమెంట్ చెల్లుబాటు కావడం లేదా అయితే ఇప్పుడే ఆధార్ తో పాన్ ను రీ యాక్టివేట్ చేసుకోండి. పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకుండా ఉంటే మీ పాన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే ఆధార్ తో లింక్ చేసుకోండి. వచ్చే ఏడాది మార్చి 31 లోగా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అవకాశం కల్పిస్తోంది. ఆ తర్వాత పాన్ కు ఆధార్ లింక్ చేయడం కుదరదని హెచ్చరిస్తోంది. గడువు తేదీని ఇప్పటికే పలుమార్లు పొడిగించిన నేపథ్యంలో మరోసారి గడువు పొడిగించే ఆలోచనే లేదని తేల్చిచెప్పింది. 31 మార్చి 2023 తర్వాత పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం సాధ్యం కాదని, పాన్ కార్డు రద్దయిపోతుందని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది మార్చి వరకూ రూ. వెయ్యి చెల్లించి పాన్ కార్డు, ఆధార్ లింక్ చేసుకోవచ్చని చెబుతోంది.
పాన్ కార్డుకు ఆధార్ ను లింక్ చేసుకోండి ఇలా..
- ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లోకి వెళ్లి క్విక్ లింక్స్ విభాగంలో లింక్ ఆధార్ ఎంపికపై క్లిక్ చేయండి.
- అక్కడ మీ పాన్‌నంబర్, ఆధార్ నంబర్, ఇతర వివరాలు ఇవ్వాలి.
- ఆధార్ వివరాలను ధృవీకరిస్తాను అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
- పాన్ కార్డుతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. వాలిడేట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- రూ.వెయ్యి జరిమానా చెల్లించాక మీ పాన్-ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది.
ఇదీ చదవండి: ప్రేమంటే ఇదేరా.. ప్రియురాలి మృతదేహానికి తాళికట్టాడు