Site icon Prime9

Bihar Floor Test: విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం నితీష్ కుమార్

Bihar: బీహార్ లో కొత్తగా ఏర్పాటైన మహాకూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. అసెంబ్లీలో ఇవాళ జరిగిన బలపరీక్షలో మూజువాణి ఓటుతో సీఎం నీతీశ్‌ కుమార్‌ విజయం సాధించారు. అయితే విశ్వాస పరీక్ష జరిగే సమయంలో ప్రతిపక్ష బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసింది. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా అసెంబ్లీలో నీతీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

బీజేపీ నేతలు 2020 ఎన్నికల గురించే మాట్లాడుతున్నారని, అంతకముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కంటే జేడీయూ ఎక్కువ సీట్లు గెలుచుకుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. వాజ్‌పేయీ, అడ్వాణీ వంటి నేతలు తననెంతో గౌరవంగా చూసేవారన్న నితీష్, ఢిల్లీ బయట జరుగుతున్నదంతా పబ్లిసిటీయేనని సెటైర్లు వేశారు. అసలు భారత స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పత్రికలను కూడా స్వతంత్రంగా పనిచేయనివ్వడంలేదని విరుచుకుపడ్డారు.

Exit mobile version
Skip to toolbar