Site icon Prime9

Nirmala Seetharaman: బడ్జెట్‌లో టంగ్‌ స్లిప్‌ అయిన నిర్మలమ్మ.. ఏమన్నారో తెలుసా?

tongue slip

tongue slip

Nirmala Seetharaman: కేంద్ర బడ్జెట్ సందర్భంగా.. పార్లమెంట్ లో కాసేపు నవ్వులు విరబూశాయి. బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఆర్ధిక మంత్రి సీతారామన్ టంగ్ స్లిప్ అయ్యారు.
పొరపాటున నోరు జారడంతో.. ఒక్కసారిగా లోక్‌సభలో నవ్వులు విరిశాయి.

వెహికల్‌ రీప్లేస్‌మెంట్‌ గురించి మాట్లాడుతూ.. ఒక్కసారిగా నోరు జారారు. ఓల్డ్‌ పొల్యూషన్‌ వెహికల్స్‌ బదులు.. ఓల్డ్‌ పాలిటిక్స్‌ అని అన్నారు. దీంతో అక్కడ అర్థమే మారిపోయింది. దీని అర్ధం పాత రాజకీయాలను తొలగించటం అన్నట్లు. ఈ మాటతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సభ్యుల ముఖాలు నవ్వులతో వెలిగిపోయాయి.

ఈ సరదా వ్యాఖ్యలపై.. ప్రతిపక్షాల సభ్యులు ఎలాంటి భావన్ని వ్యక్తం చేయలేదు.

ఈ తప్పిదాన్ని వెంటనే గమనించిన నిర్మల సీతారామన్ Nirmala Sitharaman.. సారీ అంటూ చిరునవ్వుతో వివరణ ఇచ్చారు.

పర్యావరణ పరిరక్షణ విధానంలో భాగంగా పాత కాలుష్య వాహనాలను మార్చడం అని పలుమార్లు తప్పిదాన్ని సరిచేస్తూ చెప్పారు.

పాత కాలుష్య వాహనాలను సైతం మార్చడం ఆర్థిక వ్యవవస్థను పచ్చగా మార్చడంలో ముఖ్యమైన భాగం అని అన్నారు.

2021-22 బడ్జెట్ లో పేర్కొన్న వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీని కొనసాగించడంలో రాష్ల్రాలకు కూడా మద్దతు ఉంటుందని ఆర్ధిక మంత్రి అన్నారు.

బడ్జెట్‌ చరిత్రలో వాళ్ల కోసం ప్యాకేజీ..

దేశ బడ్జెట్‌లో భాజపా ప్రభుత్వం ఓ కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టింది. పీఎం విశ్వ కర్మ కౌశల్‌ సమ్మాన్‌ పేరుతో ఆ ప్యాకేజీని తీసుకురానున్నారు.

అమృత కాల బడ్జెట్‌లో భాగంగా.. పీఎం విశ్వ కర్మ కౌశల్‌ సమ్మాన్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ఇందులో ముఖ్యంగా.. సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారుల కోసం ఈ పథకాన్ని తీసుకురానున్నారు.

ఈ పథకాన్ని.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు అనుసంధానం చేయనున్నారు.

దీని ద్వారా.. వాళ్ల ఉత్పత్తుల నాణ్యత మెరుగు పర్చవచ్చని అన్నారు.

అయితే ఈ ప్యాకేజీ ఎలా ఉంటుందో అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇలాంటి పథకాలతో పాటు.. వివిధ రంగాలకు భారీగా కేటాయింపులు చేపట్టింది.

ఏ ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు కేంద్రం 2.40 లక్షల కోట్లను కేటాయించారు.

మరో 50 ఎయిర్ పోర్టుల నిర్మాణానికి నిధులు కేటాయించారు.

అలాగే ఈ కోర్టు ప్రాజెక్టు విస్తరణ కోసం.. రూ. 7 వేల కోట్లను కేంద్రం కేటాయించింది.

5జీ సర్వీసుల కోసం 100 ల్యాబ్ ల ఏర్పాటుకు శ్రీకారం.

Nirmala Sitaraman : గ్రామీణ బ్యాంకుల్లో కూడా 2 లక్షల వరకూ క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు | Prime9 News

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar