Site icon Prime9

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు

NIA Raids

NIA Raids

NIA Raids:ఐసిస్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కర్ణాటక మరియు మహారాష్ట్రలోని 44 చోట్ల దాడులు నిర్వహించి మొత్తం 15 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.ఈ ఉదయం నుంచి ఎన్‌ఐఏ దాడులు చేస్తున్న మొత్తం 44 ప్రాంతాల్లో కర్ణాటకలో 1, పూణెలో 2, థానే రూరల్‌లో 31, థానే సిటీలో 9, భయందర్‌లోని 1 చోట ఎన్ఐఏ సోదాలు చేసినట్లు సమాచారం.

నగదు, మారణాయధాలు..(NIA Raids)

ఈ దాడుల్లో భారీ మొత్తంలో లెక్కల్లో చూపని డబ్బు, మారణాయుధాలు, పదునైన ఆయుధాలు, నేరారోపణలు చేసే పత్రాలు, స్మార్ట్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది.అల్-ఖైదా మరియు ఐసిస్‌తో సహా నిషేధిత ఉగ్రవాద సంస్థల హింసాత్మక తీవ్రవాద భావజాలానికి ఉగ్రవాద ముఠాను ఏర్పాటు చేసిన కుట్రకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి జిహాద్ చేయడానికి మతపరమైన తరగతులను నిర్వహించడమే కాకుండా భావసారూప్యత గల యువకులను తమ సమూహంలో చేర్చుకుంటున్నాయి.

Exit mobile version