New Political Front: 2024 లోక్ సభ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటివరకు యూపీఏ, ఎన్టీఏ ఫ్రంట్ లు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాయి. ఇక 2024లో మరో ఫ్రంట్ రానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లేకుండా.. ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు.. మమతా-అఖిలేష్ సన్నహాలు చేస్తున్నారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటివరకు యూపీఏ, ఎన్టీఏ ఫ్రంట్ లు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీలు తమ ఎన్నికల ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ రోజు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోల్‌కతాలో కలిశారు. వీరి భేటీలో కీలక నిర్ణయం.. తీసుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఈ విషయం ఇప్పుడు దేశరాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేకుండా మరో ఫ్రంట్ ను ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి.
మరోవైపు వచ్చే వారం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ పార్టీ చీఫ్ నవీన్ పట్నాయక్ ను కలవనున్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రతిపక్ష కూటమికి కీలక నేతగా చూపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఈ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
బీజేపీలో చేరిన తర్వాత దర్యాప్తు సంస్థలు కేసులు ఎత్తేస్తున్నాయని అఖిలేష్ యాదవ్ అన్నారు.
రాహుల్ గాంధీ ఇటీవల యూకే పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. రాహుల్ గాంధీని ఉపయోగించుకుని సభను నడపాలని అధికార బీజేపీ కోరుకోవడం లేదని తెలుస్తోంది.
రాహుల్ గాంధీనే 2024 ఎన్నికల్లో విపక్షాలకు ప్రధాని అభ్యర్థిగా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అన్నారు.
ఈ మేరకు థర్డ్ ఫ్రంట్ పాలసీని రూపొందిస్తామన్న సంకేతాలు ఇచ్చాయి. మరోపైవు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలోని విపక్షాలను ఏకం చేయడంపై కాంగ్రెస్ దృష్టి పెడుతుంది.
ఈ సమయంలో మమత, అఖిలేష్ నిర్ణయం రాజకీయ వర్గాల్ల దుమారం రేపుతోంది.
కాంగ్రెస్ ను దూరం పెట్టాడానికే ఇలాంటి ప్రణాళికలు వేసుకుంటోందని చర్చ సాగుతోంది.
బీజేపీ, కాంగ్రెస్ దూరంగా ఉంటున్న ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.