Site icon Prime9

New Parliament: పార్లమెంట్‌ నూతన భవనం ఎలా ఉందంటే.. వీడియోను షేర్ చేసిన మోదీ

new parliement

new parliement

New Parliament: భారత పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. సకల హంగులతో ఈ పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఈ నెల 28న ఆదివారం ప్రధాని మోదీ ఘనంగా ప్రారంభించనున్నారు.

ఎలా ఉందంటే..

భారత పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. సకల హంగులతో ఈ పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఈ నెల 28న ఆదివారం ప్రధాని మోదీ ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ చారిత్రక భవన ప్రారంభానికి ప్రతి పక్షాల పార్టీలు రానున్నాయి. ఇక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతన హంగులతో కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఈ భవనాన్ని నిర్మించారు.

మరో రెండు రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ భవనం వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. నూతన పార్లమెంట్‌ భవనం భారతీయ పౌరులందరూ గర్వించేలా ఉంటుందని పేర్కొంటూ #MyParliamentMyPride హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఈ భవనంలోని సమావేశ మందిరాలు, లోపల ఏర్పాటు చేసిన ప్రత్యేక చిహ్నాలు ఆకట్టుకుంటున్నాయి.

Exit mobile version