New Parliament Building: దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ ( New parliament Building)అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటోంది.
ఈ నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను కేంద్రం రిలీజ్ చేసింది. కొత్త పార్లమెంట్ భవనం ఎన్ని హంగులతో నిర్మాణమవుతుందో ఈ ఫొటోలను చూస్తే అర్ధమవుతుంది.
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా రీడెవలప్ మెంట్ ప్రణాళికలో భాగాంగా ఈ కొత్త భవనాన్ని నిర్మిస్తోంది. టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ పనులు చేపడుతోంది.
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనాలకు సమీపంలోనే కొత్త బిల్డింగ్ రూపుదిద్దుకుంటోంది.
జనవరి 31 నుంచి పార్లబెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో ఈ బిల్డింగ్ నిర్మాణ పనులు శర వేగంగా సాగుతున్నాయి.
అయితే, ఈ సమావేశాలను నూతన భవనంలో జరుపుతారా? లేదా? అన్న దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు.
65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పార్లమెంట్ నూతన భవనంలో విశాలమైన హాళ్లు , ఆధునిక లైబ్రరీ, అత్యాధునిక రాజ్యాంగ హాలు, నూతన సాంకేతికతతో ఆఫీసులు, గదులు ఉన్నాయి.
కొత్త భవనంలోని లోక్ సభలో 888 సీట్లతో నెమలి ఆకారం గుర్తొచ్చేలా డిజైన్ చేశారు.
రాజ్యసభ హాలు లో కమలం పువ్వు గర్తుకు తెచ్చేలా 384 సీట్లను అమర్చారు.
వాస్తవానికి గత ఏడాది నవంబర్ లోనే నూతన పార్లమెంట్ బిల్డింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి.
దీంతో ఈ ప్రాజెక్టు పనులను జనవరి నెలాఖరుకు పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు ముమ్మరంగా చేపడుతున్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు 2023-24 వార్షిక బడ్జెట్ ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నూతన బిల్డింగ్ లోనే ప్రవేశ పెడతారని.. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెబుతున్నారు.
నూతన బిల్డింగ్ లో యాక్సెస్ చేయడానికి ఎంపీలకు కొత్త ఐడీలను రెడీ చేస్తున్నట్టు సమాచారం. కొత్త బిల్డింగ్ లో వాడిన ఆధునిక టెక్నాలజీ అర్థమయ్యేలా వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
ఒకవేళ నూతన బిల్డింగ్ లో సమావేశాలకు ఇబ్బందులు వస్తే తొలి విడత సమావేశాలు ( జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు ) పాత భవనంలో నిర్వహిస్తారు.
రెండో విడత సమావేశాలు (మార్చి13 ) నూతన బిల్డింగ్ లో జరిపే అవకాశాలున్నాయని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ వర్గాలు తెలిపాయి.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/