Maestro Ilayaraja: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
దిండిగల్‌లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళయరాజాకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధాని ప్రదానం చేశారు. గాంధీగ్రామ్‌లో తనకు స్వాగతం పలికిన ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, గాంధీగ్రామ్‌ను స్వయంగా మహాత్మా గాంధీయే ప్రారంభించారని తెలిపారు. గ్రామీణాభివృద్ధి గురించి గాంధీ ఆలోచనల స్ఫూర్తిని ఇక్కడ చూడవచ్చునని తెలిపారు. గాంధీ చెప్పిన విలువల ఔన్నత్యం పెరుగుతోందని చెప్పారు. ఘర్షణలకు ముగింపు పలకడం కోసమైనా, వాతావరణ సంక్షోభం విషయంలోనైనా గాంధీ చెప్పిన విలువలు ఇప్పటికీ ఆచరణ యోగ్యమైనవేనని తెలిపారు.
ఇది కూడా చదవండి: Yashoda Twitter Review: సమంత ‘యశోద’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. డీసెంట్ ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్