Site icon Prime9

Mumbai: ముంబైలో మీజిల్స్ కలకలం.. దాదాపు 300 కేసులు

mumbai-reports-300-cases-of-measles

mumbai-reports-300-cases-of-measles

Mumbai: కరోనా అనంతరం దేశ ప్రజలను మీజిల్స్ భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇది ఒకరి సోకితే వారి నుంచి మరో 18 మందికి సోకే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ముంబైలో మీజిల్స్‌ వైరస్‌ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నది. మరో 32 మంది చిన్నారులకు వైరస్‌ సోకిందని బ్రిహిన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) తెలిపింది. వీటితో మొత్తం కేసులు 300కి చేరువయ్యాయి.

గతకొన్నేండ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గురువారం మధ్యాహ్నం గోవండీలోని మురికివాడలో నివాసముంటున్న ఓ 8 నెలల బాలుడు మీజిల్స్ వ్యాధితో కన్నుమూశాడు. దీనితో ఇప్పటివరకు నగరంలో మొత్తం 13 మంది చిన్నారులు మృతిచెందారు. బీఎంసీ పరిధిలోని ముంబై, మాలేగావ్‌, భీవాండీ, థాణే, నాసిక్‌, అకోలా, కళ్యాణ్‌ తదితర ప్రాంతాల్లో ఈ తరహా కేసులు రికార్డవుతున్నాయి. దీనితో ఆరోగ్య సిబ్బంది బైకళా, వర్లీ, వడాల, ధారావి, బాంద్రా, అంధేరీ, మలాడ్‌, గోవండీ, చెంబూర్‌, కుర్లా, భాండూప్‌ తదితర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. మొత్తం 1,34,833 మంది 9 నెలల నుంచి 5 ఏండ్ల మధ్య వయస్సున్న చిన్నారులకు మీజిల్స్‌-రుబెల్లా స్పెషల్‌ డోసులను పంపిణీ చేస్తున్నారు. దేశంలో మహారాష్ట్రతోపాటు బీహార్‌, గుజరాత్‌, హర్యానా, జార్ఖండ్‌, కేరళలోనూ మీజిల్స్‌ కేసులు నమోదవుతున్నాయని జాతీయ ఆరోగ్య సంస్థ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 2023 బడ్జెట్‌లో 400 కొత్త వందే భారత్ రైళ్లు

Exit mobile version