Site icon Prime9

Sonali Phogat: సోనాలి ఫోగట్ మృతదేహం పై గాయాలు.. హత్యకేసు నమోదు చేసిన పోలీసులు

Goa: బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతదేహంపై పలు గాయాలు” ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొనడంతో ఆమె మృతిపై గోవా పోలీసులు గురువారం హత్య కేసు నమోదు చేశారు. ఫోగట్ 42, ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పదంగా మరణించారు.

సోనాలి ఫోగట్ వ్యక్తిగత సహాయకుడు సుధీర్ సంగ్వాన్ మరియు అతని స్నేహితుడు సుఖ్‌విందర్ ఆమె హత్యలో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలపై త్వరలో అరెస్టు చేయబడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమె సిబ్బందిలో ఒకరికి హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా, సంబంధాలు ఉన్నాయని ఫోగట్ సోదరుడు రింకూ ధాకా ఆరోపించడంతో అతడిని కూడ విచారించే అవకాశముంది. గోవాలోని అతిపెద్ద ఆఫ్‌షోర్ కాసినోలలో ఒకదానిని కందా కలిగి ఉన్నాడు.

తన వ్యక్తిగత సహాయకుడు, అతని స్నేహితుడు తన సోదరిని రేప్ చేసి హత్య చేశారని రింకూ గోవా పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఫోగట్ తన మరణానికి గంటల ముందు తల్లి, సోదరి మరియు బావమరిదితో మాట్లాడినట్లు అతను పేర్కొన్నాడు.

Exit mobile version