Site icon Prime9

Viral News: “మా అమ్మని జైల్లో పెట్టండి” అంటూ ఓ బుడ్డోడి ఫిర్యాదు.. ఎందుకో తెలిస్తే నవ్వాగదు..?

three years kid complaint on his mother

three years kid complaint on his mother

Viral News: ఓ మూడేళ్ల బాలుడు తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎందుకో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అంత చిన్నవయస్సులో ఆ బుడ్డోడి తెలివిని చూసి మచ్చటపడిపోతారు. మరి ఆ బుడ్డోడు ఎవరు ఏమని పోలీసులకు కంప్లెయింట్ చేశాడో చూద్దామా..

తన చాక్లెట్లను వాళ్ల అమ్మ దొంగిలించిందని, ఆమెను జైలులో పెట్టాలంటూ ఓ బుడ్డోడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని బుధన్‌పూర్ జిల్లాలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. డెడ్తలై గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు ఇటీవల తన తండ్రితో కలిసి సమీప పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. ఆ చిన్నారి వాళ్ల అమ్మపై అమ్మ తనను చాక్లెట్లు తిననీయడం లేదని, తనను కొడుతున్నదని ఆ బుడతడు పోలీసుల ఎదుట అమాయకంగా చెప్పాడు.‘అమ్మ నా చాక్లెట్ దొంగిలించిందని, ఆమెను జైలులో పెట్టండి’అంటూ అమాయకంగా ఫిర్యాదు చేశాడు. కాగా, ఆ చిన్నారిని చూసి మచ్చటేసిన ఎస్‌ఐ ప్రియాంక నాయక్ కూడా ఫిర్యాదు రాస్తున్నట్లుగా బాలుడిని నమ్మించారు. అనంతరం ఆ బాలుడికి నచ్చజెప్పి, అతడి తల్లి మంచిదని, అతడి మంచి కోసమే ఆమె అలా చేస్తున్నదని చెప్పి ఇంటికి పంపారు.

ఇదిలా ఉండగా ఆ చిన్నారికి స్నానం చేయించిన అతడి తల్లి కాటుక పెడుతుండగా చాక్లెట్ కోసం మారం చేసాడని దానితో ఆమె ఓ దెబ్బ కొట్టిందని ఆ బుడతడి తండ్రి చెప్పారు. దానితో ఏడుస్తూ అతడి తల్లిపై ఫిర్యాదు చెయ్యాలని మారం చేస్తుండడంతో పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చినట్టు అతను తెలిపారు. కాగా ఇప్పుడు ఆ బుడతడు తన తల్లి గురించి అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఇదీ చదవండి: హిందీలో ఎంబీబీఎస్.. ఇదో విప్లవాత్మకమైన ఘట్టమన్న అమిత్ షా

 

Exit mobile version