mega888 Odisha CM: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన

Odisha CM: ఒడిశా కొత్త సీఎంగా మోహన్ చరణ్ మాఝీ

ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన మోహన్ చరణ్ మాఝీ పేరు ఖరారయింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కియోంఝర్ నుంచి 87,815 ఓట్ల మెజారిటీతో బీజేడీకి చెందిన మినా మాఝీపై విజయం సాధించారు. బుధవారం ఆయన ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

  • Written By:
  • Publish Date - June 11, 2024 / 07:53 PM IST

Odisha CM: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన మోహన్ చరణ్ మాఝీ పేరు ఖరారయింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కియోంఝర్ నుంచి 87,815 ఓట్ల మెజారిటీతో బీజేడీకి చెందిన మినా మాఝీపై విజయం సాధించారు. బుధవారం ఆయన ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా..(Odisha CM)

2000 మరియు 2004లో బిజేడీ కూటమి భాగస్వామిగా బీజేపీ ఉంది. తరువాత ప్రతిపక్షం గానే ఉండిపోయింది. ఇపుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఒడిశాలో ఆ పార్టీ మొదటిసారిగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మాఝీ 2000లో కియోంజర్ నియోజకవర్గం నుంచి ఒడిశా శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయిన మాఝీ పార్టీ పట్ల నిబద్దత కలిగిన కార్యకర్తగా ఉన్నారు.దీనితో బీజేపీ కేంద్ర నాయకత్వం సీఎం పదవికి అతడిని ఎంపిక చేసింది. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగే మాఝీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ప్రమాణస్వీకారానికి సంబంధించిన మొదటి ఆహ్వాన కార్డు పూరీలోని జగన్నాథుని దేవాలయంలో సమర్పించారు.

కొత్త ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవం కారణంగా భువనేశ్వర్‌లోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మరియు కోర్టులు జూన్ 12 న మధ్యాహ్నం 1 గంట తర్వాత మూసివేయబడతాయి అని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.