Site icon Prime9

New Parliament: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన మోదీ

new parliement

new parliement

New Parliament: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా.. ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని భారత ప్రభుత్వం నిర్మించింది. వైదిక క్రతువు అనంతరం మోదీ ఈ భవనన్ని.. లోక్ సభ స్పీకర్ తో కలసి ప్రారంభించారు.

అట్టహాసంగా ప్రారంభం..

నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా.. ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని భారత ప్రభుత్వం నిర్మించింది. వైదిక క్రతువు అనంతరం మోదీ ఈ భవనన్ని.. లోక్ సభ స్పీకర్ తో కలసి ప్రారంభించారు.

భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. ఉదయం 7 గంటల నుంచే పూజా కార్యక్రమాలతో.. వేడుక ఘనంగా ప్రారంభమైంది. ప్రధాన అర్చకులు రాజదండాన్ని(సెంగోల్)ను ప్రధానికి అందజేశారు. దీనిని లోక్ సభ స్పీకర్ సమీపంలో మోదీ కొలువుదీర్చారు. రెండు దశల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. మొదటి దశలో 7.15 గంటల నుంచి 9.30 గంటల వరకు ఆరాధనోత్సవం, 11.30 గంటల నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది.

వైభవంగా జరిగే ఈ వేడుకకు.. అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు పార్లమెంట్ భవనాన్ని సర్వాంగ సుదరంగా తీర్చిదిద్దారు.

ఇక కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా.. 75 రూపాయల నాణేన్ని మోదీ విడుదల చేయనున్నారు.

దీనిపై నూతన పార్లమెంటు భవనం చిత్రం ఉంటుంది. పార్లమెంటు చిత్రం కింద 2023 సంవత్సరం అనికూడా ముద్రించి ఉంది.

నాణెంపై భారతదేశం అని హిందీలో, ఇంగ్లీష్ లో వ్రాయబడి ఉంది. దీనిపై అశోక చిహ్నం కూడా ఉంది. 75 రూపాయల నాణెం ఫొటోను ఏఐ ఇప్పటి విడుదల చేసింది.

 

పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు..

పార్లమెంట్‌ కొత్త భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో లుటెన్స్‌ ఢిల్లీ ప్రాంతంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పార్లమెంట్‌ చుట్టుపక్కల ఏరియాలను పోలీసుల తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. సెంట్రల్‌ ఢిల్లీలో ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేశారు.

Exit mobile version