Site icon Prime9

Boy killed Tutor: ఢిల్లీలో ట్యూటర్ ను పేపర్ కట్టర్ తో చంపిన మైనర్ బాలుడు.

delhi

delhi

Boy killed Tutor:: తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్యూటర్‌ను చంపినందుకు 14 ఏళ్ల బాలుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ట్యూటర్ బాలుడిని నిత్యం దుర్భాషలాడేవాడని వాటిని వీడియో కూడా తీశాడని పోలీసులు తెలిపారు.పేపర్ కట్టర్ తో హత్య చేసిన మూడు రోజుల తర్వాత బాలుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

లైంగిక వేధింపులకు విసిగి..(Boy killed Tutor)

ఆగస్టు 30న మధ్యాహ్నం 2.15 గంటల ప్రాంతంలో జామియా నగర్‌లోని బాట్లా హౌస్‌లోని ఓ ఇంటి రెండో అంతస్తులోని ఓ గదిలో నుంచి రక్తం వస్తోందని, గది తెరిచి ఉందని పిసిఆర్‌ కాల్‌ వచ్చింది” అని ఆగ్నేయ ఢిల్లీ డిసిపి రాజేష్‌ డియో తెలిపారు అన్నారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం మెడపై లోతైన కోతతో నేలపై పడి ఉన్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించింది. ట్యూటర్ తన కుటుంబంతో కలిసి జాకీర్ నగర్‌లో నివాసం ఉండేవాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారుఅనేక సందర్భాల్లో అతనిని లైంగికంగా వేధించాడని పోలీసులు కనుగొన్నారు.

అతను బాలుడితో సన్నిహిత వీడియోను కూడా చిత్రీకరించాడు. దానితో అతన్ని బ్లాక్ మెయిల్ చేసేవాడు. తాను చెప్పినట్లు వినకుంటే వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించేవాడని పోలీసులు తెలిపారు.సంఘటన జరిగిన రోజు, అతని జామియా నగర్ ఇంట్లో తనను కలవాలని అతని ట్యూటర్ నుండి కాల్ వచ్చిన తర్వాత, బాలుడు పదునైన పేపర్ కట్టర్‌తో అపార్ట్మెంట్ కు చేరుకుని , సంఘటనా స్థలం నుండి పారిపోయే ముందు ట్యూటర్ గొంతుకోసి చంపాడు.పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version
Skip to toolbar