Jalpaiguri: పశ్చిమ బెంగాల్‌లోని ఒక మారుమూల గ్రామంలో రోడ్డుకు గ్రామ పాఠశాలలో చదివి, పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్ది పేరు పెట్టారు. న్యూజల్పాయ్ గురిలోని ఒక మారుమూల గ్రామమైన దోష్ దర్గాలో రాబోయే మూడు కిలోమీటర్ల రహదారికి జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు దులాల్ దేబ్‌నాథ్ సోమవారం రోడ్డుకు శంకుస్థాపన చేసారు. దీనికి హైదర్ అలీ రోడ్‌గా పేరు పెట్టారు. గ్రామంలోని పాఠశాలలో చదివి విజయం సాధించిన పేద రైతు కొడుకు కావడంతో ఈ రహదారికి హైదర్ పేరు పెట్టారని దేబ్‌నాథ్ తెలిపారు. రోడ్డు పనులు త్వరితగతిన పూర్తవుతాయని తెలిపారు.
దీని పై హైదర్ ఆలీ స్పందిస్తూ ఇది చాలా గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. అలీ గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో చదువు ప్రారంభించాడు. బెలకోబా ముడిపరా హైస్కూల్ లో ఉన్నతవిద్య పూర్తి చేసాడు. అతను జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్రంలో పిహెచ్‌డి చేసాడు. నాకు పేదరకం బాధ తెలుసు కాబట్టి ఈ గ్రామంలో పేద విద్యార్దులకు సాయం చేయాలనుకుంటున్నానని తెలిపాడు.
దీనిపై అలీ తండ్రి మట్లాడుతూ తన కొడుకు తన కోరికను నెరవేర్చాడని చెప్పాడు. నా కొడుకును ఎన్నో కష్టాలు పడి పెంచాను. అతను అత్యున్నత స్థాయిని తాకాలని నేను కోరుకున్నాను. మా గ్రామంలోని పేద విద్యార్థులకు సహాయం చేయాలనేది నా కొడుకు కోరిక. అందుకు ఓ తండ్రిగా నేను అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పాడు.