Kolkata: ప్రధాని నరేంద్ర మోదీ టీ అమ్మే వ్యక్తే కాని, తేయాకు తోటల కార్మికులకు ఆయన చేసిందేమి లేదని మమతా బెనర్జీ మేనల్లుడు, లోక్ సభ ఎంపి బెనర్జీ ప్రధాని పై విరుచుకుపడ్డారు. ఆదివారం జల్పాయిగురి జిల్లాలో తేయాకు కార్మికుల ర్యాలీలో బెనర్జీ మాట్లాడుతూ డిసెంబర్ లోగా పశ్చిమ బెంగాల్ లోని 3లక్షల మంది తేయాకు తోటల కార్మికులకు భవిష్య నిధి, గ్రాట్యుటీ అందించకపోతే బిజెపి నేతలను ఘోరావ్ చేస్తామని ఆయనతో పాటు టిఎంసీ నేతలు హెచ్చరించారు. రాష్ట్రంలో మూతపడిన ఏడు తేయాకు తోటలను స్వాధీనం చేసుకొంటామని కేంద్రం ఇచ్చిన హామీ మరిచిందని ఎద్దేవా చేసారు. మూతపడిన తోటలను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్దరించేలా చూస్తామని ఆయన కార్మికులకు హామీ ఇచ్చారు.
Abhishek Banerjee: నరేంద్ర మోదీ పై మమత మేనల్లుడు ఫైర్

Mamata's nephew fires on Narendra Modi