Site icon Prime9

Mamata Banerjee: బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం.. సీఎం మమతా బెనర్జీ

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee :పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో చర్చలు జరిపే ప్రసక్తే లేదని బుధవారం నాడు తేల్చేశారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలో  ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక జాతీయ అంశాల గురించి ఎన్నికలు ముగిసిన తర్వాత ఆలోచిద్దామని అన్నారు. దీనితో కాంగ్రెస్‌కు దీదీకి మధ్య సంబంధాలు చెడిపోయినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ తో కలవం ..(Mamata Banerjee)

తాను సీట్ల గురించి ఎవరితోనూ చర్చలు జరపలేదని మమత అన్నారు. చర్చలు జరిపారంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. అవన్నీ వట్టి అబద్దాలే అన్నారు. ఆమె పుర్బా- మెదీనిపూర్‌లో ఒక అధికారిక సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న సందర్భంగా ఈ విషయాలను ప్రస్తావించారు. అయితే నాన్‌ కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి కట్టుగా ఉన్నాయని దీదీ అన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు దీదీతో మీరు ఇస్తామన్న రెండు సీట్ల ఆఫర్‌ను కాంగ్రెస్‌ పార్టీ తిరస్కరించదని గుర్తు చేయగా దానికి ఆమె స్పందిస్తూ తాను ప్రారంభంలో ఇస్తామన్న ఆఫర్‌ను కాంగ్రెస్‌ పార్టీ తిరస్కరించిందని గుర్తు చేశారు. దీనితో తమ పార్టీ వచ్చే లోకసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చిందన్నారు. అయితే ఇండియా కూటమిలో తాము ఇంకా భాగస్వాములమేనని అన్నారు. కాగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి వారు భారత్‌ జోడో న్యాయ యాత్రను తమ రాష్ర్టంలో నిర్వహిస్తున్నారు. మర్యాద కోసమైనా తమకు ఈ విషయం చెప్పాలి కదా అని ప్రశ్నించారు.బెంగాల్‌ రాష్ర్టంలో కాంగ్రెస్‌ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని ఆమె స్పష్టం చేశారు.

ఎన్నికలు ముగిసాక..

జాతీయస్థాయిలో ఏది కావాలనుకుంటే అది చేయడానికి తాము సిద్దంగా ఉన్నాం. అది కూడా లోకసభ ఎన్నికలు ముగిసిన తర్వాతనే అని మమత స్పష్టం చేశారు. తమది సెక్యూలర్‌ పార్టీ అని బీజేపీని మట్టి కరిపించడానికి ఏం చేయాలో అది చేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు దీదీ. ప్రస్తుతానికి సీట్ల సర్దుబాటుపై ఎలాంటి చర్చలు లేవని చెప్పారు. ఇక ఇండియ కూటమి విషయానికి వస్తే కేవలం ఒక పార్టీకి సంబంధించింది కాదన్నారు దీదీ. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 300 సీట్లలో పోటీ చేయమని చెప్పామని, ప్రాంతీయపార్టీలు కలిసి 72 స్థానాల్లో పోటీ చేస్తాయన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తమ రాష్ర్టంలో అనవసరంగా జోక్యం చేసుకోరాదని హెచ్చరించారు. ఒక వేళ తమ అంతరంగిక వ్యవహరాల్లో దూరితే తాము ఏది చేయాలో అది చేసి చూపిస్తామని కాస్త ఘూటుగానే స్పందించారు మమత.

Exit mobile version