Site icon Prime9

Mallikarjun Kharge: ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసిన మల్లికార్జున్ ఖర్గే

Mallikarjun Kharge

Mallikarjun Kharge

New Delhi: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఖర్గే తన రాజీనామాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. వన్ లీడర్ వన్ పోస్ట్ అనే కాంగ్రెస్ ఉదయపూర్ తీర్మానానికి అనుగుణంగా ఆయన రాజీనామా చేశారు.

పార్టీలో పెద్ద మార్పు కోసం తాను పోరాడుతున్నానని ప్రతినిధులందరూ తనకు ఓటు వేయాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులతో ఖర్గే మాట్లాడుతూ, కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో మద్దతిచ్చినందుకు అన్ని రాష్ట్రాల సీనియర్‌ నేతలకు ధన్యవాదాలు తెలియజేసారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ నేతలు అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, ప్రమోద్ తివారీ, పీఎల్ పునియా, ఏకే ఆంటోనీ, పవన్ కుమార్ బన్సాల్, ముకుల్ వాస్నిక్ ప్రతిపాదించారు. జి23 నేతలు ఆనంద్ శర్మ, మనీష్ తివారీ కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఖర్గే పార్టీలో అత్యంత అనుభవజ్ఞుడైన వ్యక్తులలో ఒకరు మరియు దళిత నాయకుడు కూడా. ఇది అతని ప్రత్యర్థి శశి థరూర్‌ కన్నా ప్లస్ పాయింట్ గా భావించవచ్చు.

వన్ లీడర్ వన్ పోస్ట్ అనే ఉదయపూర్ తీర్మానం రాజస్థాన్‌లో పార్టీకి తీవ్ర ఇబ్బందులను కలిగించింది. తిరుగుబాటును సృష్టించి వివాదాస్పదంగా మారింది. ఈ తీర్మానం గెహ్లాట్‌ను కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే ఎవరైనా సరే వన్ లీడర్ వన్ పోస్ట్’ కు కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మరియు పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బహిరంగంగా చెప్పారు.

Exit mobile version