Mahatma Gandhi: భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన వారిలో మెుదటి వ్యక్తి మహాత్మ గాంధీ. ఎంతో మంది మహానుభావులలో గాంధీ పేరు ముందు ఉంటుంది. దేశ స్వాతంత్ర్యంలో గాంధీ పాత్ర అలాంటిది. సత్యాన్ని చేతపట్టి.. బ్రిటిష్ వారిని పారదోలిన గొప్ప నేత గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే. గాంధీ లేకుంటే.. దేశం స్వాతంత్య్రాన్ని పొందేది కాదు. అలాగే గాంధీ చేసిన సేవలను దేశం ఎన్నటికి మరవదు.
నేడు గాంధీ వర్ధంతి సందర్భంగా.. ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. మహాత్మ గాంధీ.. 1869 అక్టోబర్ 2వ జన్మించారు. బ్రిటిష్ అధికారులకు గాంధీ వ్యతిరేకంగా పోరాడి విజయాలు సాధించారు. పేదరిక నిర్మూలన.. మహిళల హక్కులకై ఎన్నో పోరాటాలు చేశారు.
మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ.. రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
భారత్ జోడో యాత్ర ముగింపులో ఉన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు.
ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఇతర నేతలు నివాళులు అర్పించారు.
నివాళుల అనంతరం.. శిరస్సు వంచి దేశ సేవలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.
గాంధీ త్యాగాలు.. ఎన్నటికీ మరువలేనివని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యనించారు.
హోం మంత్రి అమిత్ షా సైతం గాంధీకి నివాళులు అర్పించారు. స్వదేశీ, స్వయం సమృద్ధి సాధించేలా గాంధీజీ స్ఫూర్తినిచ్చినట్లు అమిత్ షా పేర్కొన్నారు.
పరిశుభ్రత, స్వదేశీ, స్వీయభాష అనే ఆలోచనలను స్వీకరించడం మంచి విషయమని అమిత్ షా ట్వీట్ చేశారు.
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ఈ మేరకు జాతీపిత బాపూజీని సీఎం స్మరించుకున్నారు.
కుల, మతాలకు అతీతంగా అన్నివర్గాల హితమే
గాంధీ కోరారని.. ఆయన ఆదర్శాలు దేశానికి అవసరమని కేసీఆర్ Cm Kcr పేర్కొన్నారు. దేశ సమగ్రత.. ఐక్యత కోసం గాంధీ తన జీవితాన్ని త్యాగం చేశారని తెలిపారు.
నమ్మిన లక్ష్యాలను చేరుకునే క్రమంలో.. ఆటంకాలను లెక్క చేయకుండా ముందుకు సాగడమే గాంధీ గొప్పతనం అన్నారు.
గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగుతామని.. కేసీఆర్ అన్నారు. నేటి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/