Site icon Prime9

Union Minister Kishan Reddy: కశ్మీర్ అందాలు తిలకించండి..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Look at the beauty of Kashmir

Look at the beauty of Kashmir

Jammu & Kashmir: పర్యాటకం, ఇతర అవసరాల నిమిత్తం భారత్ వెళ్లే పౌరులు జాగ్రత్తలు వహించాలని అమెరికా ప్రకటించన నేపధ్యంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఓ ఆసక్తిరమైన పోస్టు ట్వీట్ చేశారు. అందాలు ఒలకబోస్తున్న కాశ్మీర్ తోపాటు జమ్ము ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేలా వ్యాఖ్యానించారు.

ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూకశ్మీర్ లో మార్పులు వచ్చాయన్నారు. గడిచిన ఏడాదిలో 1.62కోట్ల మంది పర్యాటకులు జమ్మూకశ్మీర్ ను సందర్శించారని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఇదే అత్యధిక రికార్డుగా నొక్కి చెప్పారు.

ఒక విధంగా కిషన్ రెడ్డి భారతదేశంలో ఉన్న పర్యాటక కేంద్రాల్ని ప్రపంచ దేశాలకు తెలియచెప్పేలా పోస్టును ట్వీట్ చేశారు. అమెరికా హెచ్చరకలు జారీ చేసిన ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. వీటికి దూరంగా ఉండాలంటూ, ఒక వేళ ఏదైని అవసరం నిమిత్తం వెళ్లేవారు తప్పని సరిగా అమెరికా ప్రభుత్వానికి చెప్పాలంటూ అక్కడి పౌరులకు విజ్నప్తి చేసి వున్నారు.

ఇది కూడా చదవండి:New trains from Telangana: తెలంగాణ నుండి యుపి, ఆంధ్రాకు నాలుగు రైళ్లు

Exit mobile version