Kolhapur: ఏడాది ఓ మారు వచ్చే గణేషుడి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాం. కాగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉత్సవాలను చేసుకుంటారు. అయితే కొందరు తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని వినాయక వేడుకలను రంగురంగుల లైట్ల డెకరేషన్ నడుమ డీజే పెట్టి కొందరు, డప్పులతో మరికొందరు, ఇంక ఎన్నో విధాలుగా నిర్వహించుకుంటారు. ఏ వేడుకలైనా ఎవరికీ హానీ కలుగనంతవరుకే ఆనందంగా ఉంటాయి. కానీ సృతిమించితే అనేక అనర్ధాలకు దారి తీస్తాయి. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో ఒకటి చోటుచేసుకుంది. గణనాథుని వేడుకలలో దాదాపు 65 మంది చూపు పోగొట్టుకున్నారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో గణేషుని ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకల్లో ఏర్పాటు చేసిన ప్లాషింగ్ లేజర్ లైట్ల వల్ల 65మంది చూపు కోల్పోయారని వైద్యులు తెలిపారు. హైఇంటెన్సిటీ ఉన్న లేజర్ లైట్లు కళ్లలో పడుతున్నప్పటికీ గంటల తరబడి ఆ లైట్ల వెలుతురులో డాన్సు చేస్తూ కుర్రకారు ఎంజాయ్ చెయ్యడం వల్ల హైపోగ్లైసేమియా హార్మోన్లలో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. చాలా మంది కొద్దిగా లేదా పూర్తిగా చూపు కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. వీరందరికీ సర్జరీ అవసరమని అది ఎక్కువ ఖర్చు అవుతుందని తెలిపారు. కాబట్టి ఎంతటి వేడుకలైనా శ్రుతిమించితే అనర్ధమే గ్రహించి మెలగాలని కొందరి సలహా.
ఇదీ చదవండి: బాలాపూర్ లడ్డు రికార్డును బ్రేక్ చేసిన బండ్లగూడ లడ్డు