Site icon Prime9

Kolkata Doctor Case: ఆర్జీకర్‌ హత్యాచార ఘటన కేసులో – తుది తీర్పు వెలువరించిన కోర్టు, సంజయ్‌రాయ్‌కి జీవిత ఖైదు

Kolkata RG Kar Rape and Murder Case: కోల్‌కతా డాక్టర్‌ హత్యాచారం ఘటనలో సోమవారం తుది తీర్పు వెలువడింది. పశ్చిమ బెంగాల్‌ ఆర్జీకర్‌ ఆస్పత్రి ట్రైయినీ డాక్టర్‌ (అభయ) హత్యాచార కేసులో దోషిగా నిర్దారించిన సంజయ్‌రాయ్‌కి సోమవారం మధ్యాహ్నం సీల్దా కోర్టు నింజీవిత ఖైదు కేసు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తీర్పు ఇచ్చే సమయంలో వైద్యురాలి కేసు అరుదైన కేసు కెటగిరి కిందకు వస్తుందని, సమాజంపై ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు నిందితుడు సంజయ్ రాయ్‌కి మరణశిక్ష విధించాలని సీబీఐ కోర్టును కోరింది.

సీబీఐ వాదనలను సీల్దా కోర్టు సెషన్స్‌ జడ్జీ అనిర్బన్‌ దాస్‌ ఖండించారు. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరిలోకి రాదన్నారు. ఈ కేసులో మరణశిక్ష విధించకపోవడానికి కారణం ఇదే అని స్పష్టం చేశారు. తీర్పుకు ముందు నిందితుడు సంజయ్‌ రాయ్‌ తన వాదనను కోర్టు వినిపించాడు. తనని ఈ కేసులో తప్పుగా ఇరికించారని, తాను అమాయకుడినని చెప్పాడు. ఇరు వాదనలు వాదనలు విన్న న్యాయస్థానం సంజయ్‌కి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు వెలువరించింది. శనివారం ఈ కసులో సంజయ్‌ని కోర్టు దోషిగా నిర్దారించిన సంగతి తెలిసిందే. కాగా గతేడాది ఆగస్టు 9వ తేదీ రాత్రిఆర్జీకర్‌ ఆసుపత్రి సెమినార్‌ రూంలో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం జరగగా.. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది.

బాధితురాలికి కుటుంబానికి న్యాయం జరగాలంట దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను కోల్‌కతా పోలీసులు నుంచి సీబీఐ స్వీకరించి విచారించింది. ఈ కేసులో ప్రత్యేక కోర్ టు అభియోగాలను సమర్పించారు. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ పేరును మాత్రమే చార్జ్‌షీట్‌లో చేర్చారు. అయితే సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. కాగా ఘటన జరిగిన అనంతరం ఆసుపత్రి ఆవరణంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను ఆగష్టు 10న పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Exit mobile version