Site icon Prime9

Amritsar: అమృత్‌సర్‌లో పోలీసు స్టేషన్ పై దాడిచేసిన ఖలిస్థాన్ మద్దతుదారులు

Amritsar

Amritsar

Amritsar:పంజాబ్‌లో ఖలిస్థాన్ మద్దతుదారులు తమపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌ని ముట్టడించారు. తుపాకులు, కత్తులు ధరించిన ఖలిస్తాన్ మద్దతుదారులు అజ్నాల పిఎస్‌పై దాడి చేశారు. బారికేడ్లని ఛేదించుకుని మరీ పోలీస్ స్టేషన్‌లోకి జొరబడ్డారు. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌పై పెట్టిన కేసులని ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ తూఫాన్‌ అరెస్టుని వారు ఖండిస్తున్నారు.

వందలాది మంది నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. అమృత్‌పాల్ సింగ్ వ్యక్తిగత అనుచరుడి అరెస్ట్‌ను నిరసిస్తూ.. మద్దతుదారులు బారికేడ్లు తొలగించి మరీ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. భారీగా బల ప్రదర్శనతో అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్. ఆయన ముఖ్య అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. ఆ అరెస్ట్‌ను ఖండిస్తూ గ్రూప్‌కు చెందిన వందలాది మంది మద్దతుదారులు గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అజ్‌నాలా పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఫెన్సింగ్‌ను దాటి వెళ్లారు. అడ్డుగా ఉంచిన బారికేడ్లను బలవంతంగా తొలగించారు.

మా పవర్ చూపించేందుకే బలప్రదర్శన..(Amritsar)

కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన అనుచరుడు లవ్‌ప్రీత్‌ సింగ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారని వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ఆరోపించారు. ఒక్క గంటలో కేసును వెనక్కి తీసుకోకపోతే జరిగే పరిణామాలకు అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. తామేమీ చేయలేమని అధికారులు, పోలీసులు భావిస్తున్నారని, కానీ, తామేంటో చూపించేందుకే ఈ బలప్రదర్శన చేపట్టినట్లు ఆయన చెప్పారు. మరోవైపు అజ్‌నాలా పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీస్‌ బలగాలను మోహరించారు. వారిస్ పంజాబ్ దే గ్రూప్‌నకు చెందిన నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు గట్టి ప్రయత్నాలు చేశారు.

లవ్ ప్రీత్ తూఫాన్ ను విడుదల చేస్తామన్న పోలీసులు..

కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఖలిస్తాన్ మద్దతుదారుడు, చీఫ్ అమృతపాల్ సింగ్ నేతృత్వంలోని రాడికల్ గ్రూప్ ‘వారిస్ పంజాబ్ కే’ సభ్యుడిని విడుదల చేసేందుకు పంజాబ్ పోలీసులు అంగీకరించారు. అమృత్‌సర్‌లోని పోలీసు స్టేషన్‌లో వేలాది మంది మద్దతుదారులు తుపాకులు మరియు కత్తులు ఉపయోగించి బారికేడ్‌లను బద్దలు కొట్టి, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తామని బెదిరించడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.మా ముందు సమర్పించిన సాక్ష్యం ప్రకారం, లవ్‌ప్రీత్ తూఫాన్ సింగ్ డిశ్చార్జ్ అవుతుంది. కేసు దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఎస్‌పి అమృత్‌సర్ తెలిపారు.అతను (లవ్‌ప్రీత్ తూఫాన్‌) నిర్దోషి అని వారు తగిన రుజువు ఇచ్చారు. దీనిపై సిట్ విచారణ చేపట్టింది. ఈ వ్యక్తులు ఇప్పుడు శాంతియుతంగా చెదరగొట్టబడతారు మరియు చట్టం దాని స్వంత మార్గంలో పడుతుంది, ”అని పోలీసు కమిషనర్ అమృత్‌సర్ అన్నారు.

 

 

Exit mobile version