Site icon Prime9

Kedarnath Temple : భారీ వర్షాల కారణంగా కేదార్ నాథ్ యాత్రకు బ్రేక్..

Kedarnath Temple visiting stopped due to heavy rains

Kedarnath Temple visiting stopped due to heavy rains

Kedarnath Temple : ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ వద్ద భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో కేదార్ నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. గౌరీ కుండ్ నుంచి కేదార్ నాథ్ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సోన్ ప్రయాగ్ నుంచి బయల్దేరిన భక్తులు ఆగిపోవాలని అధికారులు స్పష్టం చేశారు.

నేటి ఉదయం 8 గంటల వరకు సోన్ ప్రయాగ్ నుంచి 5,828 మంది భక్తులు కేదార్ నాథ్ బయల్దేరినట్లు సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా వీరు ముందుకు వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదని తెలుస్తుంది. రానున్న 24 గంటల్లో ఉత్తరాఖండ్ లోని 7 జిల్లాలకు వాతావరణ సంస్థ భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో, కేదార్ నాథ్ వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కాగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాఖండ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అలానే పలు చోట్ల కొండచరియలు విరిగిపడి రోడ్లు కూడా మూసుకుపోయాయి. రాష్ట్రంలోని పరిస్థితులను సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

 

Exit mobile version