Site icon Prime9

Minister Somanna: మహిళను చెంప చెళ్లుమనిపించిన కర్ణాటక మంత్రి

Karnataka minister slaps woman

Karnataka minister slaps woman

Karnataka: ఆ మహిళ ప్రభుత్వ అందించే సంక్షేమాన్ని తనకు కూడా కావాలని కోరింది. నాకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని పదే పదే ప్రాధేయపడింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ ప్రజాప్రతినిధి ఏకంగా మహిళ చెంప పై చెళ్లుమనిపించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొనింది. దీంతో సభికులు ఒక్కసారిగా ఖిన్నులైనారు. జరిగిన ఘటనను కాంగ్రెస్ కార్యకర్త ట్విట్టర్ పోస్టు చేయడంతో వార్త నెట్టింట వైరల్ అయింది.

సమాచారం మేరకు, చామరాజ్ నగర్ జిల్లా హంగాల గ్రామంలో నిర్వహించిన భూ పంపిణీ కార్యక్రమంలో మౌలిక వనరుల అభివృద్ధి శాఖ మంత్రి సోమన్న హాజరైనారు. భూ క్రమబద్ధీకరణకు సంబంధించిన సెక్షన్ 94సీ ప్రకారం 175మంది గ్రామీణ ప్రాంతవాసులకు టైటిల్ డీడ్ లను పంపిణీ చేశారు.

ఈ క్రమంలో ఓ మహిళ నేను దరఖాస్తు చేసుకొన్నప్పటికీ రెవిన్యూ అధికారులకు తన పేరును లబ్దిదారుల్లో చేర్చలేదని వాగ్వివాదానికి దిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సోమన్న మహిళ చెంపపై ఓ దెబ్బ కొట్టారు. అయినా సరే ఆ మహిళ మంత్రి కాళ్లకు దణ్నం పెడుతూ తన గోడును వెళ్లబోసుకొనింది.

భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటకలో పలుమార్లు మహిళల పై చేతులు చేసుకొంటున్నారు. నోరు పారేసుకొంటున్నారు. గతంలో న్యాయశాఖ మంత్రి మధుస్వామి ఓ మహిళా రైతును అందరి ఎదుట తిట్టారు. మరో భాజపా ఎమ్మెల్యే అరవింద్ లింబావలి ఓ మహిళను తిట్టిన వీడియో వైరల్ అయింది. తాజాగా మంత్రి సోమన్న ఏకంగా మహిళపై చేయి చేసుకోవడాన్ని కన్నడ ప్రజలు తప్పుబడుతున్నారు.

ఇది కూడా చదవండి: Ration Cards Row: కర్ణాటకలో రేషన్ కార్డుల పై ఏసుక్రీస్తు బొమ్మ.. చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్

Exit mobile version