Border Dispute: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం దృష్ట్యా కొల్హాపూర్ జిల్లాలో మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 37 విధించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల తర్వాత, ఒకే చోట 5 మంది కంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం విధించబడింది. ఈ నిషేధం డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు కొనసాగుతుంది. శనివారం, కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగామహావికాస్ అఘాడి అధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రదర్శనకు అధికారులు, పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు.
మరోవైపు మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై సుప్రియా సూలే నేతృత్వంలోని ఎన్‌సిపి అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరియు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపిల బృందం శుక్రవారం పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసింది. ఈ విషయమై శివసేన ఉద్ధవ్ వర్గం అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని.. మహారాష్ట్ర ప్రయోజనాలను పరిష్కరిస్తామని తెలిపారని అన్నారు.
కర్ణాటక, మహారాష్ట్ర రెండు రాష్ట్రాలు పరస్పరం తమ భూభాగాలపై నియంత్రణను కోరుతున్నాయి. ఇది చాలా పాత వివాదం అయినప్పటికీ, ఇటీవలి కాలంలో దీనికి సంబంధించి మరలా ఉద్రిక్తతలు పెరిగాయి.