Site icon Prime9

Rahul Gandhi: దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం.. కర్ణాటక సర్కార్ పై మండిపడ్డ రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

Karnataka: దేశంలోనే అత్యంత అవినీతిమయమైన కర్ణాటక ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కర్ణాటక సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని చిత్రదుర్గ సమీపంలోని హిరియూర్‌లో ఓ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దాదాపు ప్రతిదానికీ కమీషన్లు తీసుకుంటోందని అన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలంటూ నాగమోహన్ దాస్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రాహుల్ గాంధీ కోరారు. రెండున్నరేళ్లుగా ఈ నివేదిక పై తాము ఏమీ చేయలేదని, ఈ నివేదిక పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, సమయాన్ని వృథా చేయవద్దని, ఈ నివేదికను ఒకేసారి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లేకుండా, అధిక సంఖ్యలో ప్రజలు పెరుగుతున్న ధరల భారంతో మునిగిపోతున్న అన్యాయమైన భారతదేశాన్ని దేశ ప్రజలు సహించరని రాహుల్ అన్నారు.

ఈ దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు వ్యాప్తి చేస్తున్న ద్వేషం, హింస, కోపంపై పోరాటమే తమ పార్టీ భారత్ జోడో యాత్ర అని రాహుల్ అన్నారు. ఈ యాత్రలో హింస లేదు, ద్వేషం లేదు, కోపం లేదన్న సందేశం ఈ యాత్రలో స్పష్టంగా కనిపిస్తోందని, భారతదేశం విడిపోదని, భారతదేశం ఏకతాటి పై నిలబడుతుందనే సందేశం ఇది బీజేపీకిస్తోందని అన్నారు. తనతో పాటు నడిచిన మరియు తనకు మద్దతుగా వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, గాంధీ బసవ, నారాయణ గురు మరియు బిఆర్ అంబేద్కర్ వంటి నాయకులను గుర్తు చేసుకున్నారు. ఈ నాయకులు ఎవరూ హింస లేదా ద్వేషాన్ని బోధించనందున ఈ రోజు వారి గొంతులు ఈ దేశంలో ప్రతిధ్వనిస్తున్నాయని తెలిపారు.

Exit mobile version