Site icon Prime9

Karnataka Elections 2023: ఉద్వేగ ప్రసంగాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Karnataka Elections 2023

Karnataka Elections 2023

Karnataka Elections 2023: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని రాజకీయ పార్టీలు కన్నడ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాతి రోజే కాంగ్రెస్ పార్టీ కూడా ఓటర్లకు వరాలు ప్రకటించింది. గృహిణులు, నిరుద్యోగ యువత, ఉద్వేగ ప్రసంగాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ఓటర్ల ముందుకు తీసుకొచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ పార్టీ కర్ణాటక ఛీప్ డీకే శివకుమార్ లు కలిసి ఈ మేనిఫెస్టో విడుదల చేశారు. ‘సర్వ జనాంగద శాంతియ తోట’ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు.

 

 

విద్వేషాన్ని ప్రోత్సహించే సంస్థలపై(Karnataka Elections 2023)

మైనార్టీ వర్గాల మద్య ద్వేషాన్ని ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేతలు. అదే విధంగా బజరంగ్ దళ్, పీఎఫ్ఐ లాంటి సంస్థలపై నిషేధం విధించడంతో పాటు చట్ట ప్రకారం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2006 నుంచి సర్వీస్ లో చేరిన పెన్షన్ పొందే ప్రభుత్వ ఉద్యోగులకు ఓపిఎస్ పొడిగింపును కాంగ్రెస్ పరిశీలిస్తోందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

 

కీ రోల్ గా నందిని పాల అంశం

మరో వైపు ఈ సారి కర్ణాటక ఎన్నికల్లో నందిని పాల అంశం కీ రోల్ గా మారింది. దారిద్య రేఖకు కింద ఉన్న కుటుంబాలకు ప్రతిరోజు ఉచితంగా అరలీటరు నందిని పాలు అందజేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో తెలిపింది. అయితే దీనిపై కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని 1.5 లీటర్లకు పెంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆవులు, గేదెల కొనుగోలుకు రూ. 3 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపింది. రైతులకు పాల సబ్సిడిని రూ. 5 నుంచి రూ. 7 లకు పెంచుతామంది. అదే విధంగా కర్ణాటకకు గర్వ కారణమైన నందిని పాలను ధ్వంసం చేయడానికి ఎవరినీ అనుమతించబోమని తేల్చి చెప్పింది.

 

మేనిఫెస్టో లోని ముఖ్యాంశాలు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అన్యాయమైన, ప్రజావ్యతిరేక చట్టాలను తొలగిస్తాం.

నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు 2 సంవత్సరాల పాటు నెలకు రూ. 2 వేలు, డిప్లొమా పూర్తి అయిన వారికి రూ. 1,500

శక్తి పథకం కింద KSRTC/BMTC బస్సుల్లో రాష్ట్ర మహిళలకు ఉచిత ప్రయాణం.

గృహలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబంలోని మహిళకు నెలకు రూ. 2వేలు

వర్గాల మధ్య విద్వేషాన్ని ప్రోత్సహించే సంస్థలపై నిషేధం విధించడం.

ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పంపిణీ

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి వ్యక్తికి 10 కేజీల ఆహారధాన్యాలు

 

Exit mobile version