Site icon Prime9

Jyotiraditya Scindia: ‘భారత్‌ జోడో’ కు కొత్త అర్దం చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా

Union-minister-Jyotiraditya-Scindia

Jyotiraditya Scindia: రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ‘భారత్‌ జోడో యాత్ర ’ పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈశాన్య భారతాన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలతో రైలు, వాయుమార్గాల ద్వారా అనుసంధానం చేయడాన్ని అసలైన ‘భారత్‌ జోడో’గా అభివర్ణించారు. అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌లోని డోనీ పోలో విమానాశ్రయం నుంచి ముంబయి, కోల్‌కతాలకు విమాన సేవలను సోమవారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. 2013-14కు ముందు ఈశాన్య రాష్ట్రాల్లో మరిన్ని విమానాశ్రయాలు ఎందుకు నిర్మించలేదని ఆయన కాంగ్రెస్‌ పార్టీని సూటిగా ప్రశ్నించారు.

అప్పటివరకు ఈ ప్రాంతంలో తొమ్మిది ఎయిర్‌పోర్టులే ఉండగా, ఈ ఏనిమిదేళ్లలో 16కు పెంచినట్లు సింధియా తెలిపారు. ‘ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగతా ప్రాంతాలతో రైలు, విమాన మార్గాల ద్వారా అనుసంధానించడమే నిజమైన ‘భారత్ జోడో’’ అని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీల పేరు ఎత్తకుండానే మంత్రి వ్యాఖ్యానించారు. ఇటీవల ఇటానగర్‌లోని గ్రీన్‌ఫీల్డ్‌ హోలోంగి విమానాశ్రయాన్ని ఇటీవల డోనీ పోలో విమానాశ్రయంగా పేరు మార్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో సుమారు రూ.646 కోట్ల వ్యయంతో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. పది రోజుల క్రితం ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు. తాజాగా ముంబయి, కోల్‌కతాలకు విమాన సేవలు ప్రారంభమయ్యాయి.

Exit mobile version