జార్ఖండ్‌: రూ.10వేల లంచం రూ.30 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది..

:జార్ఖండ్‌ మంత్రి అలమ్‌గిర్‌ ఆలమ్‌ సెక్రటరీ నుంచి ఈడీ అధికారులు ఏకంగా రూ.30 నుంచి రూ.40 కోట్లు వసూలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేవలం రూ.10వేల లంచం కాస్తా రూ.30 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది.

  • Written By:
  • Updated On - May 7, 2024 / 07:19 PM IST

Jharkhand:జార్ఖండ్‌ మంత్రి అలమ్‌గిర్‌ ఆలమ్‌ సెక్రటరీ నుంచి ఈడీ అధికారులు ఏకంగా రూ.30 నుంచి రూ.40 కోట్లు వసూలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేవలం రూ.10వేల లంచం కాస్తా రూ.30 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈడీ అధకారులు జార్ఖండ్‌ రూరల్‌ డెవలెప్‌మెంట్‌ డిపార్టుమెంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ వీరేంద్ర రామ్‌ను అరెస్టు చేశారు. అయితే వీరేంద్ర రామ్‌ కేవలం రూ.10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

కాగా రామ్‌ విషయానికి వస్తే ఉన్నతాధికారుల్లో అతను లో ప్రొఫైల్‌ పాటించేవాడు. అయితే ఈడీ అధికారుల విచారణలో అవినీతి నెట్‌వర్క్‌ ఎలా పనిచేస్తోందో వివరించాడు. లంచం తీసుకుంది తాను ఒక్కడినే కాదని .. దాదాపు అధికారులు కొటరీ అంతా లంచాలు తీసుకుంటారని ఆయన తెలిపాడు. వివిధ చానల్స్‌ద్వారా లంచాలు ఎలా తీసుకుంటామో కూడా వివరించారు. ముఖ్యంగా టెండర్‌ ప్రాసెస్‌లో పెద్ద ఎత్తున లంచనాలు తీసుకుంటామని వివరించాడు.

ఈడీ విచారణలో..(Jharkhand)

వివరాలు సేకరించిన తర్వాత ఈడీ మరింత లోతుగా విచారణ మొదలుపెట్టింది. రామ్‌ నుంచి సేకరించిన సమాచారంతో పాటు వివిధ వర్గాల నుంచి కూడా ఈడి సమాచారం సేకరించింది. జార్ఖండ్‌లోని గ్రామీణాభివృద్ది శాఖలో పెద్ద ఎత్తున లంచాలు బెడద ఎక్కువగా ఉందని తెలుసుకొని గత ఏడాది మే9న ప్రభుత్వానికి ఈడీ లేఖ రాసి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే వీరేంద్ర రామ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత అతను పలు అంశాలు చెప్పాడు. ముఖ్యంగా కాంట్రాక్టర్లకు టెండర్లు కేటాయించినప్పుడు కమిషన్లు ఇస్తారని చెప్పాడు. ఏప్రిల్‌ 14, 2023లో ఆయన స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేసింది. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్‌ 3.2 శాతం తీసుకుంటామని, తన వాటా 0.3 శాతమని రామ్‌ చెప్పాడు.

రామ్‌ను సమాచారం సేకరించిన తర్వాత ఈడీ నిన్న సోమవారం, రూరల్‌ డెవలెప్‌మెంట్‌ మంత్రి అలంగిర్‌ అలమ్‌ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌లాల్‌ను అనుమానితుడి అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా లాల్‌ అధికారులకు పూర్తి వివరాలు ఇచ్చాడు. కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు. వారి నుంచి ఎంత కమిషన్‌ తీసుకుంది వివరాలు చెప్పేశాడు. లాల్‌ ఇంటిపై ఈడీ దాడుల్లో డబ్బుల కట్టలు చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. లాల్‌ ఇంట్లో లెక్కల్లో చూపని సుమారు రూ. 34 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కౌంటింగ్‌ మిషన్లు తెచ్చి రాత్రంతా లెక్కబెట్టాల్సి వచ్చింది. ఇదే కాకుండా మరో వ్యక్తి ఇంటి నుంచి రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే జార్ఖండ్‌ గ్రామీణాభివృద్ది శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరగుతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే మంత్రి అలంగిర్‌ ఆలంను ఈడీ అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలుచెప్పాయి. ఈడీ అధికారులు పూర్తి సాక్ష్యాధారాలను తమ వద్ద ఉంచుకొని అధికారులను పిలిపిస్తున్నారు.