Site icon Prime9

Tamil Nadu IT Raids: తమిళనాడులో రియల్ ఎస్టేట్ సంస్థ ఆస్తులపై ఐటీ దాడులు

Tamil Nadu IT Raids

Tamil Nadu IT Raids

Tamil Nadu IT Raids: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై, అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె)తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ జి స్క్వేర్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఆదాయపు పన్ను (ఐటి) శాఖ దాడులు ప్రారంభించింది.చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, కర్ణాటకలోని హోసూర్‌, బెంగళూరు, మైసూర్‌, బళ్లారి, తెలంగాణలోని జి స్క్వేర్‌ రిలేటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 7 గంటలకు సోదాలు ప్రారంభమయ్యాయి.కంపెనీ యజమాని రామజయం అలియాస్ బాలా నివాసంలో కూడా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

డీఎంకే నేతల నివాసాల్లోనూ..( Tamil Nadu IT Raids)

చెన్నై, కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, హోసూర్ మరియు ఇతర ప్రాంతాల్లోని పలు G స్క్వేర్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో బయట పోలీసులను మోహరించారు.ఇదిలావుండగా, అన్నానగర్ డీఎంకే ఎమ్మెల్యే ఎంకే మోహన్ కుమారుడి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడంతో డీఎంకే కార్యకర్తలు నిరసనకు దిగారు. జి స్క్వేర్‌కంపెనీ అక్టోబర్ 12, 2012న స్థాపించబడింది.

ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పార్టీపై అవినీతి ఆరోపణల్లో భాగంగా డీఎంకే ఫైల్స్‌ను ఈ నెల ప్రారంభంలో  తమిళనాడు బీజేపీచీఫ్న్ అన్నామలై  విడుదల చేశారు. తన వాల్యుయేషన్స్ మరియు అంచనాల ప్రకారం, డిఎంకె నాయకుల ఆస్తుల విలువ 1.34 లక్షల కోట్లు అని మాజీ ఐపిఎస్ అధికారి ఆరోపించారు. ఈ ఆరోపణలపై డీఎంకే స్పందించి  అన్నామలైకు  లీగల్ నోటీసులు పంపింది.అన్నామలై ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మరియు ఇతర పార్టీ నాయకుల నీచమైన, పరువు నష్టం కలిగించే, అపకీర్తి మరియు ప్రేరేపిత ప్రకటనలతో ప్రతిష్టను దిగజార్చడానికి, నిరంతర ప్రయత్నాలు చేస్తున్నారని  డీఎంకే ఆరోపించింది.

Exit mobile version