MP Dheeraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ దాడులు పూర్తి చేసిన తర్వాత, మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు రూ.350 కోట్లుగా తేలింది. ఒడిశాలోని డిస్టిలరీ యూనిట్లలో ఈ నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఒకే ఆపరేషన్‌లో ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న అత్యధిక నగదు ఇదే. పట్టుబడిన కరెన్సీ నోట్ల లెక్కింపు ఐదు రోజుల పాటు కొనసాగింది.
ఎస్‌బిఐ లో డిపాజిట్ ..( MP Dheeraj Sahu)
స్వాధీనం చేసుకున్న నగదును మూడు ఎస్‌బిఐ బ్రాంచ్‌లలో (బలంగీర్, సంబల్‌పూర్ మరియు టిట్లాగఢ్) లెక్కింపు కోసం బ్యాగుల్లో తీసుకెళ్లారు. ఎస్‌బిఐ బలంగీర్ బ్రాంచ్‌కు అత్యధికంగా నిండిన 176 బ్యాగ్‌లలో నగదు తీసుకు వెళ్లడం జరిగింది. అక్కడ నోట్లను లెక్కించడానికి అదనపు సిబ్బందిని మోహరించారు.ఆదాయపు పన్ను శాఖ అధికారులు ధీరజ్ సాహుకు సంబంధించిన ఆస్తులపై ఇంకా డాక్యుమెంటేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దాదాపు 40 కరెన్సీ లెక్కింపు యంత్రాలను ఈ నగదును లెక్కించడానికి ఉపయోగించారు.ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం నగదును నేడు బలంగీర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రధాన శాఖలో డిపాజిట్ చేయనుంది.
ఎంపీ ధీరజ్ సాహుతో సంబంధం ఉన్న మద్యం కంపెనీ నుంచి భారీ మొత్తంలో నగదు రికవరీ కావడంతో కాంగ్రెస్ దీనిపై తమకు సంబంధం లేదంటూ స్పష్టం చేసింది.భారత జాతీయ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు వ్యాపారాలతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఆస్తుల నుండి ఆదాయపు పన్ను అధికారులు ఎలా భారీ మొత్తంలో నగదును బయటపెట్టారో ఆయన మాత్రమే వివరించాలి అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో పోస్ట్ చేసారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా దీనిపై X లో స్పందించారు.దేశప్రజలు ఈ నోట్ల కుప్పను చూసి, ఆపై వారి నాయకుల నిజాయితీ ప్రసంగాలను వినాలి. ప్రజల నుండి ఏది దోచుకున్నా, ప్రతి పైసా తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. ఇది మోదీ హామీ అంటూ ట్వీట్ చేసారు.
Pictures of the over Rs 300 Cr Cash Seized from INC MP Dhiraj Prasad Sahu @CNNnews18 https://t.co/lVP20XUzAP pic.twitter.com/b69JqS3OwI
— Aman Sharma (@AmanKayamHai_) December 11, 2023