New Delhi: ఆదాయపు పన్ను శాఖ కోల్‌కతాకు చెందిన ప్రముఖ బిజినెస్ గ్రూప్ పై సోదాలు మరియు జప్తు ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్బంగా లెక్కల్లో చూపని రూ. 250 కోట్లు ఆదాయాన్ని గుర్తించింది. ఈ బిజినెస్ గ్రూప్ పవర్ ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్ స్ట్రక్చర్, స్టీల్ స్ట్రక్చర్స్, స్టీల్ పైప్స్ మరియు పాలిమర్ ఉత్పత్తులు మొదలైన వాటి తయారీలో నిమగ్నమై ఉంది. స్వాధీనం చేసుకున్న సాక్ష్యాల ప్రకారం ఈ గ్రూప్ అనేక షెల్ కంపెనీలను ఉపయోగించుకున్నట్లు తెలిసింది. ఈ షెల్ ఎంటిటీలు గ్రూప్ వ్యాపారంలోకి షేర్ క్యాపిటల్/అన్‌సెక్యూర్డ్ లోన్ ముసుగులో ఖాతాలో లేని డబ్బును వెనక్కి పంపినట్లు కనుగొనబడింది. అదనంగా, అనేక షెల్ కంపెనీల వెబ్ ద్వారా రూ.150 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో ఒక ఎంట్రీ ఆపరేటర్ చేసిన నమోదులు కూడా కనుగొనబడ్డాయి. వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్‌లో ఈ సంస్దకు చెందిన 28 ప్రదేశాల్లో సోదాలు జరిగాయి.
ఈ సందర్బంగా బోగస్ ఖర్చులు మరియు బహిర్గతం చేయని నగదు విక్రయాల బుకింగ్‌ను ప్రదర్శించే పత్రాలు మరియు డిజిటల్ డేటా రూపంలో పెద్ద సంఖ్యలో నేరారోపణ సాక్ష్యం కనుగొనబడింది. అంతేకాకుండా, స్థిరాస్తి మరియు లెక్కలో చూపని నగదు రుణాల సముపార్జనకు లెక్కలో చూపని నగదును ఉపయోగించిన ఆధారాలు కూడా కనుగొనబడ్డాయి.