Israel-Kerala Connection: ఇజ్రాయెల్ పోలీసు బలగాలకు భారతదేశం యొక్క దక్షిణాది రాష్ట్రమైన కేరళతో ముఖ్యమైన సంబంధం ఉంది. కేరళలోని కన్నూర్‌లో ఉన్న ఒక దుస్తుల తయారీ సంస్థ, మరియన్ అపారెల్ ప్రైవేట్ లిమిటెడ్, 2015 నుండి ఇజ్రాయెల్ పోలీసుల కోసం ఏడాదికి సుమారు లక్ష యూనిట్ల యూనిఫామ్‌లను సరఫరా చేస్తోంది.
అంతేకాదు ఇజ్రాయెల్ జైలు పోలీసుల కోసం సుమారు 50,000 చొక్కాలు మరియు జాకెట్లను కూడా తయారు చేస్తుంది.ఒక ఏడాదికి మేము ఇజ్రాయెల్ పోలీసుల కోసం లక్ష చొక్కాలను తయారు చేస్తాము. మేము ఇజ్రాయెల్ జైలు పోలీసుల కోసం చొక్కాలు మరియు జాకెట్లను కూడా తయారు చేస్తాము. జైలు పోలీసులకు ఏడాదిలో దాదాపు 30 వేల నుంచి 50 వేల వరకు షర్టులు, జాకెట్లు పంపిస్తామని సంస్ద మేనేజింగ్ డైరక్టర్ థామస్ ఒలికల్ తెలిపారు. మరియన్ అపారెల్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అయితే కంపెనీ యొక్క యూనిఫాం తయారీ యూనిట్ కన్నూర్‌లో 2008 నుండి పనిచేస్తోంది. థామస్ ప్రకారం ఈ యూనిఫాంల కుట్టు మరియు తయారీ యూనిట్ లో దాదాపు 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు.
యుద్ధం ప్రారంభమైన తర్వాత గత వారం, యూనిఫాంల అదనపు సరఫరా అవసరమని ఇజ్రాయెల్ తమకు తెలియజేసిందని చెప్పారు.యూనిఫామ్‌ల కోసం ఉపయోగించే మెటీరియల్ నాణ్యతను వివరిస్తూ, థామస్ ఫాబ్రిక్ యూఎస్ నుండి దిగుమతి చేసుకుంటామని తెలిపారు.ఇది కొన్ని స్పెసిఫికేషన్లతో 100 శాతం పాలిస్టర్ అని చెప్పారు. .ఇజ్రాయెల్ పోలీసులతో పాటు కంపెనీ ఖతార్, కువైట్, సౌదీ అరేబియా మరియు ఫిలిప్పీన్స్‌లోని పోలీసులకు కూడా యూనిఫామ్ లను తయారు చేస్తుంది. ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ తమ వద్ద శిక్షణ పొందారని థామస్ తెలిపారు.