Influenza flu: కోవిడ్ తరహా ఇన్ ఫ్లుయెంజా కేసులు.. హెచ్చరించిన ఐఎంఏ

న్ ఫ్లుయెంజా తో బాధపడుతున్న వాళ్లకు యాంటీబయాటిక్స్ కాకుండా రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స అందించాలని వైద్యులకు సూచించింది.

Influenza flu: దేశంలో గత రెండు నెలలుగా దీర్ఘకాలిక దగ్గుతో పాటు జ్వరం తో కోవిడ్ లక్షణాలతో ఇన్ ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నాయి.

గత రెండేళ్లు కరోనా మహమ్మారితో బాధపడిన ప్రజలు ఇప్పుడు పెరుగుతున్న ఫ్లూ తో ఇబ్బంది పడుతున్నారు.

దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రజలు బాధపడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యకు ఇన్‌ఫ్లుయెంజా -ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐఎంఏ )

వెల్లడించింది. గత కొంత కాలంగా ఈ వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. ఇతర సబ్ టైప్ లతో పోల్చితే దీని తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది.

 

కేసుల పెరగడానికి కారణమదే

మరోవైపు దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం కేసులు పెరుగుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుర్తించింది. అయితే, చికిత్సకు యాంటీ బయాటిక్స్‌ ను విపరీతంగా వాడొద్దని సూచించింది.

‘ఈ వైరస్ మామూలుగా 5 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. మూడు రోజుల్లో జ్వరం తగ్గుముఖం పట్టినా.. దగ్గు మాత్రం 3 వారాల వరకు ఉంటుంది.

15 ఏళ్లలోపు, 50 ఏళ్లు పైబడిన వాళ్లు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేసుల పెరగడానికి గాలి కాలుష్యం మరో కారణంగా ఉంది’ అని మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది.

ఇన్ ఫ్లుయెంజా తో బాధపడుతున్న వాళ్లకు యాంటీ బయాటిక్స్ కాకుండా రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స అందించాలని వైద్యులకు సూచించింది.

ప్రస్తుతం ప్రజలు అజిత్రోమైసిన్, అమోక్సిక్లావ్ లాంటి యాంటీ బయాటిక్స్‌ను ఇష్టారాజ్యంగా వాడుతున్నారని.. అది యాంటీ బయాటిక్స్‌ నిరోధకతకు దారి తీస్తాయని తెలిపింది.

కాబట్టి, వాటి వాడకాన్ని నిలిపేయాలని సూచించింది. లేని పక్షంలో అవసరమైన సందర్భాల్లో అవి పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని ఐఎంఏ హెచ్చిరించింది.

 

 

ఆ టాబ్లెట్స్ వాడొద్దు

డయేరియా, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ల చికిత్సకు ఉపయోగించే అమోక్సిసిలిన్, నార్‌ఫ్లోక్సాసిన్‌, ఒప్రోఫ్లోక్సాసిన్, ఆఫ్లోక్సాసిన్, లెవోఫ్లోక్సాసిన్‌ లాంటి యాంటీబయాటిక్స్‌లను విపరీతంగా వాడుతున్నారని ఐఎంఏ పేర్కొంది.

కరోనా సమయంలో ప్రజలు అజిత్రోమైసిన్, ఐవర్‌మెక్టిన్‌లను విస్తృతంగా వినియోగించారని.. ఇది కాస్త.. యాంటీ బయాటిక్‌ నిరోధకతకు దారి తీసిందని తెలిపింది.

ఈ నేపథ్యంలో రోగులకు యాంటీబయాటిక్స్ సూచించే ముందు.. అది బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షనా? అని నిర్ధారించుకోవడం అవసరమని ఐఎంఏ సూచిస్తోంది.

రోగి కోలుకున్న తర్వాత కూడా ఇన్ ఫ్లూయోంజా లక్షణాలు తీవ్రంగా ఉంటున్నాయి. అయితే ఈ వైరస్ వల్ల ప్రాణాపాయం లేకున్నప్పటికీ తీవ్రంగా దెబ్బతీస్తోంది.

కొంత మంది రోగుల్లో శ్వాసకోస సమస్యలు కూడా వస్తున్నట్టు నిపుణులు తెలుపుతున్నారు.

 

వైరస్ లక్షణాలు

దగ్గు, వికారం, వాంతులు అవ్వడం, గొంతు మంట, శరీరం నొప్పి, అతిసారం,

 

 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఇన్ఫెక్షన్ బారిన పడినపుడు ఫేస్ మాస్కులు ధరించాలి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి.

క్రమం తప్పకుండా నీరు, సబ్బుతో చేతులను తరచూ కడగాలి.

తరచుగా ముక్కు, నోటిని తాకడం మానేయాలి.

శరీరం డీహైడ్రేట్ గా అవ్వకుండా చూసుకోవాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి.

షేక్ హ్యాండ్, బయట ఉమ్మివేయడం మానేయాలి.

యాంటీ బయాటిక్స్, ఇతర మెడిషన్స్ డాక్టర్లను సంప్రదించిన తర్వాత మాత్రమే వాడాలి.