Site icon Prime9

Canada: భారతీయ విద్యార్థులను తిరిగి వెనక్కిపంపేందుకు రంగం సిద్దం చేసిన కెనడా ప్రభుత్వం

Canada (DEPORT)

Canada (DEPORT)

Canada: ఉన్నత విద్యకు కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులను తిరిగి వెనక్కిపంపేందుకు కెనడా ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. కెనడాలోని ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌ ప్రాంతంలో విద్యార్థులు శుక్రవారం నాడు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. తమను బలవంతంగా ఇండియాకు పంపవద్దని ప్రభుత్వానికి వారు మొరపెట్టుకుంటున్నారు. తాము ఇక్కడ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినా తమకు వర్క్‌పర్మిట్‌ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. తమ డిమాండ్లను ఆమోదించకపోతే నిరాహారదీక్షకు కూర్చుంటామని ఇండియన్‌ స్టూడెంట్స్‌ హెచ్చరిస్తున్నారు.

పర్మినెంట్‌ రెసిడెన్స్‌ ఇవ్వడం లేదు..(Canada)

గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా తమకు పర్మినెంట్‌ రెసిడెన్స్‌ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. కాగా కెనడా ప్రభుత్వం రాత్రికి రాత్రి పాలసీ మార్చింది. దీంతో ఇప్పుడు విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకుడు రూపేందర్‌సింగ్‌ సీబీసీ వార్తసంస్థకు తెలిపాడు. ఇక్కడి ప్రభుత్వం తమను మోసం చేసిందని చెప్పాడు. తాను కెనడాకు 2019లో వచ్చానని చెప్పాడు. తమకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారని విద్యార్థులు ఆరోపించారు.

విద్యార్థుల నిరసన ప్రదర్శన..

ఇక వీడియో పూటేజీ చూస్తే ఇండియాకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో షార్లెట్‌టౌన్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. రాత్రి రాత్రి పాలసీ మార్చినందుకు పెద్ద ఎత్తున నినాదలు చేశారు. వలస వచ్చిన వారితో పాటు స్థానికులకు కూడా ఇబ్బందులు తప్పవన్నారు. ఇంటర్నేషనల్‌ గ్రాడ్యుయేట్స్‌ లేరంటే స్థానికులకు సేవలు ఆలస్యం అవుతాయి. ఉదాహరణకు టిమ్‌ హర్టన్‌లో ఒక కాఫీ కావాలంటే 20 నిమిషాల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. కాగా ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌ రావడానికి ప్రధాన కారణం ఇక్కడ నిబంధనలు విద్యార్థులకు అనుకూలంగా ఉండటమే అని విద్యార్థులు వివరించారు.

జీవితంలో ఒకేసారి ఇలాంటి అవకాశం దొరుకుతుందని ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌కు వచ్చామని విద్యార్థులు చెప్పారు. దీనికి ప్రధాన కారణం ఇక్కడికి వచ్చిన ఆరు నెలలకు, లేదా ఏడాదికి పర్మినెంట్‌ రెసిడెన్స్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే తాజాగా ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌ కొత్త చట్టాలు తీసుకు వచ్చి కేవలం కొన్ని కోర్సుల్లో క్వాలిఫై అయిన వారికి మాత్రం వర్క్‌ పర్మిట్‌ ఇస్తామని, మిగిలిన వారు దేశం విడిచి వెళ్లిపోవాలని చట్టం తెచ్చింది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థులు కన్స్‌స్ర్టక్షన్‌/ హోమ్‌ బిల్డింగ్‌, హెల్త్‌కేర్‌ రంగాల్లో పనిచేయడానికి పర్మిట్‌ ఇస్తోంది. దీంతో వివిధ దేశాల నుంచి వచ్చిన చాలా మంది విద్యార్థులు తిరిగి మాతృదేశానికి తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభంలో మనీటోబాలో కూడా ఇలాంటి నిబంధనలు అమల్లోకి తేవడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలుపడంతో ప్రభుత్వం దిగివచ్చి రెండు సంవత్సరాల పాటు ఉండేందుకు అనుమతి ఇచ్చింది. మరి ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌లో విద్యార్థులకు అలాంటి ఊరట లభిస్తుందా లేదా వేచా చూడాల్సిందే.

 

 

Exit mobile version