Site icon Prime9

Indian Railways: నేడు 155 రైళ్లు రద్దు

indian-railways-cancelled-155-trains-across-india-today

indian-railways-cancelled-155-trains-across-india-today

Indian Railways: భారతీయ రైల్వే శాఖ భారీగా ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికులు వాటిని గమనించాలని సూచించింది.

రైల్వేశాఖ ప్రయాణికులను అలర్ట్ చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ అండ్ టూరిజం కార్పొరేషన్( IRTC)ప్రకటించింది. మరో 55 రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. 26 రైళ్ల స్టేషన్లను మార్చామని, 17 రైళ్లను రీషెడ్యూల్ చేశామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైళ్ల వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవాలని కోరారు. రద్దైయిన రైళ్ల టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకున్న ప్రయాణికుల టిక్కెట్లు ఆటోమేటిగ్గా క్యాన్సిల్ అవుతాయని, వాటికి సంబంధించిన నగదు యూజర్ల అకౌంట్లలోకి రీఫండ్ అవుతుందని వెల్లడించారు. కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర రీఫండ్ పొందవచ్చని రైల్వే శాఖ అధికారులు సూచించారు.

ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు సజీవదహనం

Exit mobile version