Sharad Pawar: ముంబైలో తన పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అజిత్ పవార్ వర్గం, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు (బిజెపి) ఎన్‌సిపిని అవినీతిమయం అన్నారు. మరి ఇప్పుడు ఎన్సీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఉద్ధవ్ ఠాక్రేకు ఏం జరిగిందో అదే రిపీటయిందని శరద్ పవార్ అన్నారు.మాకు అధికారం కోసం ఆకలి లేదు. మేము ప్రజల కోసం పని చేస్తూనే ఉంటామని అన్నారు.
నా ఫోటోను వాడుతున్నారు..(Sharad Pawar)
పార్టీ గుర్తు మా దగ్గరే ఉంది, అది ఎక్కడికీ పోదు. మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు మా వెంటే ఉన్నారు.వారు (అజిత్ పవార్) నా ఫోటోను ఉపయోగిస్తున్నారని నాకు తెలుసు. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. వాళ్లకు ఎలాంటి మద్దతు లేదని తెలిసి నా ఫొటోను వాడుతున్నారని అన్నారు.”అజిత్ పవార్‌కు ఏమైనా సమస్యలుంటే నాతో మాట్లాడి ఉండాల్సింది. ఆయన మనసులో ఏదైనా ఉంటే నన్ను సంప్రదించి ఉండేవాడు. విడిపోవాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలు మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోలేదు. అజిత్ పవార్ వర్గం ఎలాంటి విధానాన్ని అనుసరించలేదని శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్రలో ఎన్‌సిపి సంక్షోభం మధ్య, రెండు వర్గాలు శరద్ పవార్ మరియు అజిత్ పవార్-బలాన్ని ప్రదర్శించడానికి కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బాంద్రాలో అజిత్ పవార్ శిబిరం సమావేశం జరుగుతుండగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమావేశం ముంబైలోని వైబి చవాన్ సెంటర్‌లో జరుగుతోంది. అజిత్ పవార్ క్యాంప్ ఏర్పాటు చేసిన సమావేశానికి 29 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ వర్గం ప్రకటించింది. శరద్ పవార్ శిబిరం విషయానికొస్తే, ఆయన సమావేశానికి ఇప్పటివరకు 13 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ సమావేశం తర్వాత ఈరోజు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించే అవకాశాన్ని అజిత్ పవార్ శిబిరం పరిశీలిస్తోందని ఎన్‌సిపి పార్టీ పేరు మరియు గుర్తుపై దావా వేయాలని భావిస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు శరద్ పవార్ శిబిరం కూడా ఎన్నికల సంఘానికి కేవియట్ దాఖలు చేసింది.