Site icon Prime9

PM Modi Comments: ఇండియా కూటమికి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే ఎజెండా ఉంది.. ప్రధాని మోదీ

PM Modi

PM Modi

PM Modi Comments: సనాతన ధర్మం చుట్టూ ఇటీవల చెలరేగిన వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. విపక్ష ఇండియా కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని బినాలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సహా, రాష్ట్రంలో పది కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి గురువారంనాడు శంకుస్థాపన చేశారు. 50వేల 700 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా బినాలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు.

ఇండియా కూటమికి నాయకుడు లేడు..(PM Modi Comments)

స్వామి వివేకానంద, లోకమాన్య తిలిక్ స్ఫూర్తిగా నిలిచిన సనాతన ధర్మాన్ని పూర్తిగా చెరిపేయాలని వీరు కోరుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. ఈ రోజు సనాతనన ధర్మాన్ని బహిరంగంగా విమర్శించడంతో ఈ దాడులు మొదలుపెట్టి, రేపు మనపై ఈ దాడులను ముమ్మరం చేస్తారని అన్నారు ప్రధాని. దేశంలోని సనాతనధర్మ అనుయాయులు, దేశాన్ని ప్రేమించేవారంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి వారిని ప్రజలను అడ్డుకోవాలని చెప్పారు. ఇండియా కూటమికి నాయకుడు లేడని, నాయకత్వంపై గందరగోళం ఉందని ప్రధాని విమర్శించారు.

ముంబైలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఒక పాలసీ రూపొందించారు. భారతీయ సంస్కృతిపై దాడి…భారతీయుల విశ్వాసాలపై దాడి చేయడమే ఇండీ ఎలయెన్స్‌ విధానం” అని మోదీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని చిరకాలం పాలించిన నేతలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అవినీతి, నేరాలకు నిలయంగా రాష్ట్రం ఉండేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయలకు దూరంగా రాష్ట్రం ఉండేదన్న విషయం అప్పటి తరం ప్రజలకు తెలుసన్నారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రోడ్లు, ఇంటింటా విద్యుత్ వెలుగులు వచ్చాయని చెప్పారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ, జి-20 సదస్సుకు భారతదేశం అధ్యక్షత వహించి చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుందన్నారు. జి-20కి విజయవంతంగా అధ్యక్షత వహించిన మోదీ ఈరోజు ఇక్కడకు వచ్చారని, ఇది గర్వకారణమని అన్నారు. దేశం కోసమే కాకుండా ప్రపంచ సంక్షేమం కోసం ఎవరైనా పనిచేస్తున్నారంటే అది మోదీయేనని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రశంసించారు.

Exit mobile version