Site icon Prime9

Himachal Pradesh Elections: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు.. 62 మంది అభ్యర్దులతో బీజేపీ మొదటి లిస్ట్

Himachal pradesh

Himachal pradesh

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 కోసం భారతీయ జనతా పార్టీ బుధవారం 62 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12 నఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 25

బీజేపీ విడుదల చేసిన జాబితాలో ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సెరాజ్ నుంచి, సత్పాల్ సింగ్ సత్తి ఉనా స్థానం నుంచి పోటీ చేయనున్నారు.కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రామ్‌ కుమారుడు అనిల్‌ శర్మ మండి స్థానం నుంచి బరిలోకి దిగారు.కొంతమంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కలేదు. బీజేపీషెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కేటగిరీకి చెందిన 11 మంది అభ్యర్థులకు,షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) కేటగిరీకి చెందిన ఎనిమిది మంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది.షెడ్యూల్డ్ తెగకు మూడు సీట్లు మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయి. ఎక్కువమంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు మరియు పోస్ట్-గ్రాడ్యుయేట్లు కావడం విశేషం.

2017 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 44 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 21 సీట్లు వచ్చాయి.పోలింగ్ నాడు ఓటుహక్కువినియోగించుకోలేని ఓటర్లు ఫారం 12-డిని రిటర్నింగ్ అధికారికి (ఆర్‌ఓ) సమర్పించడం ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) మనీష్ గార్గ్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలను కోరుకునే దరఖాస్తులు అక్టోబర్ 21, 2022 నాటికి రిటర్నింగ్ అధికారి కి చేరుకోవాలన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో మొదటిసారిగా ఈ సదుపాయాన్ని పొడిగిస్తున్నట్లు గార్గ్ చెప్పారు.

Exit mobile version