Site icon Prime9

Hijab ban: కేసు తేలేంత వరకు.. క్లాస్ రూంలో హిజాబ్ తొలగించాల్సిందే.. కర్ణాటక మంత్రి

Hijab should be removed in the classroom until the Hijab case is resolved

Hijab should be removed in the classroom until the Hijab case is resolved

Karnataka: కేసు తేలేంతవరకు, రాష్ట్రంలో విద్యా సంస్ధల్లో హిజాబ్ ను విద్యార్దులు తొలగించాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ పేర్కొన్నారు.

సుప్రీం కోర్టులో హిజబ్ కేసుకు సంబంధించి న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారని తెలిపారు. దీంతో ఈ కేసు విస్తృత ధర్మాసనం పరిశీలనకు వెళ్లే అవకాశం ఉందన్నారు. హిజాబ్ విషయంగా యధాస్ధితిని కాపాడాలని సుప్రీం కోర్టు సూచించిందన్నారు. తుది తీర్పుకు అందరూ లోబడాలని ఆయన అన్నారు. అప్పటివరకు హిజాబ్ విషయంలో ప్రస్తుత నియమాలను పాటించాల్సిందేనన్నారు.

ఉల్లంఘణలకు పాల్పొడిన విద్యార్ధుల పై చర్యలు తప్పవని హెచ్చరించారు. క్లాస్ రూంలో హిజాబ్ ధరించడం కుదరదన్నారు. విద్యార్ధినులు మొండి పట్టుకు పోకుండా తరగతులకు హాజరై ఉజ్వల భవిష్యత్ ను అందుకోవాలని విజ్నప్తి చేశారు. మతాచారాల కంటే విద్య ముఖ్యమని మంత్రి నాగేష్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: జీవిత ఖైదు కేసులో మాజీ ప్రొఫసర్ సాయిబాబాకు ఊరట

Exit mobile version