Site icon Prime9

గాలి జనార్దన్ రెడ్డి: బీజేపీ కి గుడ్ బై చెప్పిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి.. కొత్త పార్టీ పేరిదే..?

Gali

Gali

Gali Janardhan Reddy: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి ఆదివారం తన సొంత పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్షను ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కూడా రెడ్డి ప్రకటించారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది కొత్త రాజకీయ ఎపిసోడ్‌. కళ్యాణ కర్ణాటక ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు వచ్చాను, రానున్న ఎన్నికల్లో ప్రతి ఇంటిని సందర్శిస్తాను. రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ప్రజలను విభజించి, పరిణామాల నుండి లబ్ది పొందాలని ప్రయత్నిస్తే, కర్ణాటకలో అది సాధ్యం కాదు. రాష్ట్ర ప్రజలు ఎల్లవేళలా ఐక్యంగానే ఉన్నారని అన్నారు.

బీజేపీ మంత్రి శ్రీరాములుతో విభేదాల ఊహాగానాలను గాలి జనార్దన్ రెడ్డి తోసిపుచ్చారు. నాకు బీజేపీలో ఎవరితోనూ విభేదాలు లేవు. శ్రీరాములు చిన్నప్పటి నుంచి ఆప్తమిత్రుడని, ఇంకా మంచి అనుబంధం కొనసాగిస్తామని అన్నారు.అక్రమ మైనింగ్ ఆరోపణలపై గాలి జనార్దన్ రెడ్డి జైలుకెళ్లినప్పటి నుంచి ఆయనకు బీజేపీ నేతలతో విభేదాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల అక్రమ మైనింగ్ కేసులో నిందితుడైన ఆయన 2015 నుంచి బెయిల్‌పై బయట ఉన్నారు. బెయిల్ మంజూరు చేస్తూనే, పాస్‌పోర్టును సరెండర్ చేయాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది.

కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడపలను సందర్శించకుండా నిషేధిస్తూ సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్‌లో అనేక షరతులు విధించింది. ఇటీవల అక్టోబరులో, రెడ్డి అనుమతి కోరిన తరువాత, బళ్లారి సందర్శించడానికి మరియు నవంబర్ 6 వరకు తన కుమార్తెను కలవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది.

Exit mobile version