Ragharam Rajan: రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘరామ్ రాజన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? గత కొంత కాలంగా రాజన్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు వెల్లువెత్తాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. డిసెంబర్ 2022లో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో రాజన్ రాహుల్‌తో కలిసి వెంట నడిచారు. అప్పట్లో రాజన్ త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారన్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ప్రింట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమి చెప్పారో చూద్దాం.
రఘురాం రాజన్ రాహుల్‌తో కలిసి భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట నడిచారు. దీంతో రాజన్ కూడా త్వరలో కాంగ్రెస్‌లోల చేరబోతున్నారన్న వార్తలు వెల్లువెత్తాయి. ఆ పుకార్లను రాజన్ స్వయంగా తెరదించారు. తాను రాజకీయాల్లో వెళ్లాలంటే తన కుటుంబం అడ్డుపడుతోందన్నారు. తన భార్య మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఇదే విషయాన్ని తాను పలు మార్లు చెప్పినా.. తనను ప్రజలు నమ్మడం లేదన్నారు.ఎప్పుడైతే ప్రభుత్వ విధానాలు గాడితప్పినట్లు భావిస్తే తాను దాని గురించి మాట్లాడుతా.. అప్పుడు చాలా మంది తాను రాజకీయాల్లో చేరుతానని ఊహించుకుంటారని రాజన్ వివరించారు.
ఇక రాహుల్ గాంధీతో ఉన్న సన్నిహిత సంబంధాల గురించి .. ఆయనకు మీరు ఇచ్చిన సలహాల గురించి ప్రశ్నిస్తే.. దానికి ఆయన సమాధానమిస్తూ.. చాలా మంది రాహుల్‌ను అసమర్ధుడిగా చిత్రీకరిస్తారు. ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని భావిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించలేడనే వాదనలు తరచూ తెరపైకి తెస్తుంటారు. తన అంచనా ప్రకారం అవన్నీ తప్పు. ఆయనను అసమర్ధుడిగా కావాలని చిత్రీకరిస్తున్నారు. ఆయన తెలివైనవాడు. ధైర్యవంతుడు.. చాలా మంది ఆయనను తేలికగా తీసేస్తారు. కానీ ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది ఆయన కుటుంబంలో ఆయన నానమ్మను తుపాకి గురి చేసి దారుణంగా హత మార్చారు. ఆయన తండ్రిని మానవబాంబులతో పేల్చేశారు. ఇవన్నీ తట్టుకొని నిలబడిన వ్యక్తి రాహుల్ .. అంత తేలికగా తీసేయాల్సిన వ్యక్తి కాదు అని రాజన్ రాహుల్‌పై ప్రశంసలు కురిపించారు.
రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఎల్లప్పుడు ప్రజల మధ్యలోనే ఉండాలి. అంత అనుభవం తనకు ఉంటే రోజంతా మంచానికే అతక్కుని ఎందుకుంటాను అని ఎదురు ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉండాలంటే శాసించేతత్వం ఉండాలన్నారు రాజన్. రాహుల్ రికార్డను పరిశీలించాలని కోరారు. కోవిడ్ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా సరైనవే… కరోనా గురించి అప్పట్లో రాహుల్ మాట్లాడుతూ.. చాలా ముందుంగా సన్నద్దం కావాల్సింది. త్వరగా స్పందించాల్సిందని కరోనా గురించి రాహుల్ ప్రస్తావిస్తూ అన్నారు. కరోనా సెకండ్‌వేవ్ అప్పుడు ర్యాలీలు నిలిపివేయాలని రాహుల్ ఆదేశించారు. ఇప్పుడు రాజకీయాలను పక్కనపెడదామన్నారని రాహుల్ చెప్పిన మాటలను రాజన్ గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ వద్ద అన్నీ ప్రశ్నలకు జవాబు ఉండదు. అయినా తన అంచనా ప్రకారం ఆయన మంచి రాజకీయ నాయకుడు.. అయితే ప్రజలు ఆయనను వేరే విధంగా చిత్రీకరిస్తున్నారు. ఆయనకు ఉన్న పట్టుదల… ఏ అంశం మీదనైనా చర్చించడానికి ఆయన సిద్దంగా ఉంటారు. మీరు తనతో ఏకీభవించకున్నా.. అతను మాత్రం ప్రతి అంశంపై డిబేట్ చేయడానికి అనుకూలంగా ఉంటారని రాహుల్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌గా పనిచేసిన రాజన్ మాత్రం మోదీ ప్రభుత్వం పాలసీని తప్పుబట్టారు. ముఖ్యంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్‌తో పాటు చిప్ ఇండస్ర్టీపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. మొత్తానికి ఆర్‌బీఐ మాజీ చీఫ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని మరోమారు స్పష్టం చేశారు. మరి ఇప్పటికైనా నమ్ముతారా….