Site icon Prime9

Delhi : ఢిల్లీ చాందినీ చౌక్ లో అగ్నిప్రమాదం.. 50 షాపులు దగ్గం..

DELHI

Chandni Chowk: ఢిల్లీ చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్‌లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరగింది. దీనితో  ప్రధాన భవనంలో చాలా భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. శుక్రవారం రాత్రి హోల్‌సేల్ మార్కెట్‌లో మంటలు చెలరేగడంతో 50కి పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. ఒక దుకాణంలో చెలరేగిన మంటలు వెంటనే పక్కనే ఉన్నవాటికి వ్యాపించాయని, అధికారులు తెలిపారు.

40 అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదుఅగ్నిమాపక శాఖ మంటలను ఆర్పేందుకు రిమోట్ కంట్రోల్ ఫైర్ ఫైటింగ్ మెషీన్లను ఆశ్రయించాల్సి వచ్చింది. మాజీ కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ, మంటలు చెలరేగిన ప్రధాన భవనం రెండు అంతస్తులు పూర్తిగా దెబ్బతినడంతో నెమ్మదిగా కూలిపోతోందని అన్నారు.

Exit mobile version