Tamil Nadu: కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం కారులో హోసూర్ వెళ్ళారు. అక్కడ వాళ్ళ పనులు ఐపోయాక ఇంటికి తిరిగి వచ్చే సమయంలో దారులు తెలియక గూగుల్ మ్యాప్స్ ను పెట్టుకొని వస్తుండగా వరదల్లో చిక్కుకుపోయారు. గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిలోనే వచ్చాడు. అలా వాళ్ళు ఇంటికి వచ్చే దారి కాకుండా తప్పు దారిలో రావడం వలన అతను తమిళనాడు కృష్ణ గిరి జిల్లాలోని బాగేపల్లి బ్రిడ్జి దగ్గరకు వెళ్ళాడు.మ్యాప్స్ చూపించే దారి సరయినదా, కాదా అని ఒక్క నిమిషం కూడా ఆగి చూసుకోకపోవడం వల్ల అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా వరదల్లో చిక్కుకుపోయారు.
అతని తప్పు తెలుసుకున్న కారు యజమాని కారును వెనక్కి తిప్పి వెళ్ళాలనుకున్నాడు కానీ అతనికి సాధ్యమవ్వలేదు. ఇంకా లాభం లేదులే అని వెంటనే అగ్ని మపక సిబ్బందికి సమాచారాన్ని తెలిపాడు.వాళ్ళు వెంటనే అక్కడకి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.వాళ్ళను బయటకు తీసుకురావడానికి భారీ క్రేనులు కూడా ఉపయోగించి మరి అతని కుటుంబాన్ని రక్షించారు.