Madhya Pradesh: వారి జోవనోపాధికి దీపావళి పండుగ సమాధి కట్టేలా చేసింది. ఓ టపాసుల గోదాములో చోటుచేసుకొన్న పేలుడుకు నలుగురు బలైనారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకొనింది. మధ్యప్రదేశ్ మెరెనా నగర ఎస్పీ అశుతోష్ బగ్రీ సమాచారం మేరకు, బాన్ మోర్ ప్రాంతంలో టపాకాయల గోదాములో ఘటన చోటుచేసుకొనింది. అమ్మడానికి నిల్వ చేసిన టపాకాయులు పేలుడుతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలైనాయి. ఉదయం 11గంటలకు చోటుచేసుకొన్న ఘటనకు టపాకాయలు పేలుడుతోనా, వాటికి ఉపయోగించే గన్ పౌడర్ వల్ల పేలుడు వల్ల సంభవించిందా అని పోలీసులు విచారణ చేస్తున్నారు.
పేలుడు తీవ్రతకు గోదాము పూర్తిగా నేలమట్టం అయింది. ప్రత్యేక దర్యాప్తు బృందం పేలడుకు గల కారణాలను పరిశీలిస్తుంది. గోదాము నిర్వహణకు అనుమతి కూడా తీసుకోకుండా టపాకాయలు నిల్వ చేసిన్నట్లు ప్రాధామిక దర్యాప్తులో తేలింది.
ఇది కూడా చదవండి: Suicide: పోలీస్ స్టేషన్ లో దంపతులకు ఎస్సై కౌన్సిలింగ్.. అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డ భార్య