Site icon Prime9

PM Modi in Odisha : జూన్‌ 4న ఒడిషా ప్రభుత్వం ఎక్స్‌పైరీ డేట్‌!.. ప్రధాని మోదీ జూన్‌ 4న ఒడిషా ప్రభుత్వం ఎక్స్‌పైరీ డేట్‌!.. ప్రధాని మోదీ

PM Modi in odisha

PM Modi in odisha

PM Modi in Odisha : ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓడిషాలో పర్యటించారు. సోమవారం నాడు ఉదయం బెహరాంపూర్‌లో ఓ ర్యాలీలో ప్రసంగించారు. ధనిక రాష్ర్టమైన ఒడిషాను వంతుల వారిగా ఇక్కడి ప్రభుత్వాలు లూటీ చేశాయని ఇటు కాంగ్రెస్‌, అటు బీజు జనతాదళ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా.. ప్రకృతి వనరులు కలిగిన సంపన్న రాష్ర్టం ఇప్పటికి పేద రాష్ర్టంగా మిగిలిపోవడం విచారకరమని ప్రధాని అన్నారు.

పదేళ్లలో రూ.3.5 లక్షల కోట్లు ఇచ్చాం..(PM Modi in Odisha )

ఒడిషాలో నీరు పుష్కలంగా ఉంది. సారవంతమైన భూమి, ఖనిజాలు, సుదీర్ఘ తీర ప్రాంతం, ఘనమైన చరిత్ర. సంస్కృతి ఉన్నాయన్నారు. భగవంతుడు రాష్ర్టానికి కావాల్సినంత ఇచ్చాడు. అయినా.. ఒడిషా పౌరులు ఎందుకు ఇక్కడ పేదలుగా బతుకుతున్నారు. దీనికి జవాబు ఒక్కటే లూటీ.. లూటీ…మొదటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ర్టాన్ని లూటీ చేసింది. ఇప్పుడు బీజేడీ నాయకులు లూటీ చేస్తున్నారు. ఒడిషాలో చిన్నపాటి నాయకుడు కూడా పెద్ద బంగ్లాలో నివాసం ఉంటున్నాడని ప్రధాని మోదీ బీజేడీ నాయకులపై మండిపడ్డారు. కాగా ఒడిషాలో ఇటు శాసనసభతో పాటు లోకసభ ఎన్నికలు జరుగనున్నాయి. ;ప్రధానమంత్రి గంజాంలో జరిగిన ఓ ర్యాలీలో బీజేడీ నాయకుడు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌పై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం హింజిలీ నుంచి కూలీలు ఇతర రాష్ర్టాలకు వలస ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. రాష్ర్టంలోని ఆస్పత్రుల్లో డాక్టర్ల పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని నిలదీశారు. అలాగే స్కూళ్లలో పిల్లల డ్రాప్‌ అవుట్‌ ఎందుకు ఎక్కువగా ఉందన్నారు. దీనికి కారణం రాష్ర్టాభివృద్దికి బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడమేనని ప్రధాని అన్నారు. కేంద్రంలో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియాగాంధీ రిమోట్‌ కంట్రోల్‌తో పది సంవత్సరాల పాటు ప్రభుత్వం నడిపారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లలో కేవలం లక్షల రూపాయలు ఒడిషాకు కేటాయిస్తే.. తాను పదేళ్లలో రూ.3.5 లక్షల కోట్లు ఇచ్చానని మోదీ చెప్పారు. కేవలం డబ్బుతో మాత్రం పనులు జరగవన్నారు మోదీ.

ఒడిషా ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని అటకెక్కించిందన్నారు. గర్భిణి మహిళలకు కేంద్రప్రభుత్వం రూ.6,000 ల ఆర్థిక సాయం చేస్తోంది.., అయితే ఒడిషా సర్కార్‌ అత్యంత కీలకమైన ఈ స్కీంను రద్దు చేసిందని గుర్తు చేశారు. కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.10వేల కోట్లు పంపిస్తే..రాష్ర్టప్రభుత్వం దాంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాలని డబ్బు పంపించినా. ఇప్పటికి రోడ్ల పరిస్థితి బాగుపడలేదన్నారు మోదీ.కేంద్రప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిస్తే.. బీజేడీ ప్రభుత్వం ఆ ప్యాకెట్లపై ముఖ్యమంత్రి ఫోటోలు అంటించి పంపిణి చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. ఒడిషా ప్రజలు బీజేడీ ప్రభుత్వంతో విసిగిపోయారు. జూన్‌ 4తో బీజేపీ ప్రభుత్వం ఎక్స్‌పైరీ తేదీ అయిపోతుందన్నారు. బీజేపీ ఒడిషా యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు మోదీ. ముందు చూపుగల మెనిఫెస్టో అంటూ ప్రశంసించారు.ఇదిలా ఉండగా గత 25 సంవత్సరాల నుంచి నవీన్‌ పట్నాయక్‌ ఒడిషాకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. పట్నాయక్‌ను గద్దె దించాలని బీజేపీ అగ్ర నాయకత్వం ఇక్కడ మకాం వేసింది. కాగా రాష్ర్టంలో లోకసభతో పాటు శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. మే, 13, జూన్‌ 1న పోలింగ్‌ జరుగనుంది.

 

Exit mobile version