ED Raids: స్థానిక ఇసుక మాఫియాకు సంబంధించిన కేసులకు సంబంధించి తమిళనాడులోని 40కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద ఈ సోదాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులు మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించినవి కాదని సంబంధిత వర్గాలు ధృవీకరించాయి. ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (‘ఇసిఐఆర్’) నమోదు చేసిందని తెలిపాయి.
ఇసుక మైనింగ్ లైసెన్స్‌లు కలిగి ఉన్న పారిశ్రామికవేత్తలు ఎస్ రామచంద్రన్ మరియు దిండిగల్ రథినం దర్యాప్తు సంస్థ పరిశీలనలో ఉన్నారని వార్తలు వచ్చాయి. మంత్రి సెంథిల్ బాలాజీ పేరు కూడా ప్రచారంలో ఉంది.. కోయంబత్తూరు, కరూర్, తిరుచ్చిలలో అరెస్టయిన మంత్రికి సన్నిహితంగా ఉండే వ్యక్తుల నివాసాలు, కార్యాలయ ప్రాంగణాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు ఐఏఎన్ఎస్ నివేదిక పేర్కొంది. సెంథిల్ బాలాజీని జూన్ 14న సచివాలయంలోని ఆయన అధికారిక నివాసం, కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించి అరెస్టు చేసి పుఝల్ సెంట్రల్ జైలులో ఉంచింది. ఇసుక మైనింగ్ వ్యాపారి శేఖర్ రెడ్డికి ఎస్ రామచంద్రన్ భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. 2016లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కూడా పుదుకోట్టైలోని అతని ఆస్తులపై సోదాలు నిర్వహించింది.
తమిళనాడులోని రాజకీయ నాయకులు మరియు బ్యూరోక్రాట్‌లతో సహా ‘ప్రభావవంతమైన వ్యక్తుల’తో రామచంద్రన్‌కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు మైనింగ్ శాఖా మంత్రి దురై మురుగన్ పేరు కూడా ఈడీ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.