Odisha Encounter: మంగళవారం తెల్లవారుజామున ఒడిశాలోని కలహండి జిల్లాలో రాష్ట్ర నిఘా విభాగం (ఎస్‌ఐడబ్ల్యూ) భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించగా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ర్యాంక్ అధికారి గాయపడ్డారు.
కందమాల్ జిల్లా సరిహద్దులోని కలహండిలోని మదన్‌పూర్ రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తపరెంగా-లుడెన్‌గాడ్ అడవుల్లో మావోయిస్టుల శిబిరం ఉన్నట్లు ఎస్‌ఐడబ్ల్యూ టీమ్‌కు సమాచారం అందిందనిపోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (మావోయిస్ట్ వ్యతిరేక కార్యకలాపాలు) అమితాబ్ ఠాకూర్ తెలిపారు.భవానీపట్న పట్టణం నుండి స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కమాండోలను ఆపరేషన్ ప్రారంభించడానికి చాలా సమయం పట్టేది. దీనితో ఎస్‌ఐడబ్ల్యూ సిబ్బంది వెంటనే తాపరెంగా-లుడెన్‌గడ్ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు.
అక్కడకుచేరుకోగానే మావోయిస్టుల నుంచి కాల్పులు జరిగాయి. వారు ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మా డిఎస్పీలో ఒకరికి కాలికి బుల్లెట్ గాయాలు తగిలాయి అతన్ని బొలంగీర్ పట్టణంలోని ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడు భువనేశ్వర్‌కు తీసుకువచ్చారని ఠాకూర్ చెప్పారు.ఎన్‌కౌంటర్ స్థలం నుండి ఒక AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు,