ECI: కేంద్ర ఎన్నికల సంఘం.. మూడు పార్టీలకు షాక్ ఇచ్చింది. ఆ పార్టీ జాతీయ హోదాలను రద్దు చేసింది. ఇందులో సీపీఐ, తృణమూల్, ఎన్సీపీ జాతీయ పార్టీ హోదాను రద్దు చేసింది. ఇక ఆప్ కు జాతీయ పార్టీ హోదా కల్పించింది. దీంతో పాటు.. ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును ఈసీ తొలగించింది.
కేంద్ర ఎన్నికల సంఘం.. మూడు పార్టీలకు షాక్ ఇచ్చింది. ఆ పార్టీ జాతీయ హోదాలను రద్దు చేసింది. ఇందులో సీపీఐ, తృణమూల్, ఎన్సీపీ జాతీయ పార్టీ హోదాను రద్దు చేసింది. ఇక ఆప్ కు జాతీయ పార్టీ హోదా కల్పించింది. దీంతో పాటు.. ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును ఈసీ తొలగించింది.
పంజాబ్ లో ఘన విజయం తర్వాత.. ఆ పార్టీ జాతీయ హోదాను దక్కించుకుంది. పార్టీల హోదాలను మారుస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు వెలువరించింది. సమగ్ర విశ్లేషణ, పార్టీలతో చర్చల అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
దిల్లీ, పంజాబ్‌లలో ఆప్ అధికారంలో ఉంది. అలాగే గుజరాత్, గోవాలో జరిగిన ఎన్నికల్లో ఓట్లు భారీగా సంపాదించింది. దీంతో జాతీయ హోదా ప్రకటించారు.
దీంతో పాటు ఏపీలో బీఆర్ఎస్ గుర్తింపును కోల్పోయింది. యూపీలో ఆర్‌ఎల్‌డీ, మణిపుర్‌లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే రాష్ట్ర హోదాను కోల్పోయాయి.
వీటితో పాటు.. బెంగాల్‌లో ఆర్‌ఎస్‌పీ, మిజోరంలో ఎంపీసీలు రాష్ట్ర పార్టీ హోదాను కోల్పోయాయి.
మేఘాలయలో వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీకి, టిప్రా మోతాకు త్రిపురలో రాష్ట్ర పార్టీ హోదాలు లభించాయి.